రాజమౌళి లాగానే సందీప్ వంగా మారుతున్నాడు!!
ఇప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో తన సినిమా కంటే ముందు వచ్చే ప్రతి సినిమా ఫంక్షన్ కు వెళ్లి ఆయా సినిమాలకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. ఇది అందరికీ కొత్తగా సరికొత్తగా అనిపిస్తుంది. ఓ టాప్ దర్శకుడు ఈ విధంగా చేయడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి దాదాపు అందరు దర్శకులకు బాగా దగ్గరగా ఉంటారు. వారితో పర్సనల్ గా కూడా అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు ఇలా చేయడం అందరి దర్శకులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు.
తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయాడు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇటీవలే పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రానికి ఇచ్చే రివ్యూ విషయమై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో సోషల్ మీడియాలో రాజమౌళి తర్వాత అలా చేసే దర్శకుడుగా సందీప్ ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయన ఈ విధంగా చేయడం పట్ల అందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు కూడా. రాజమౌళి నీ చూసి ఇలా చేయడం పట్ల కొంతమంది సినిమా విశ్లేషకులు ఇది మంచి పరిణామం అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకా ఎంత మంది దర్శకులు ఈ విధంగా ప్రవర్తిస్తారో చూడాలి