మా అమ్మ మీద ఓట్టు..నన్ను నమ్మండి..ఆ వీడియో పై షణ్ముఖ్ క్లారిటీ..!!

VUYYURU SUBHASH
షణ్ముఖ్ జశ్వంత్ .. గత మూడు నెలల ముందు వరకు ఈయన ఫాలోయింగ్ ఎలా ఉండేదంటే.. స్టార్ హీరోకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో టాప్ లో ఉండేది. కానీ బిగ్ బాస్ తరువాత కొంచెం తగ్గిందనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్లిన షన్ను తోటి కంటెస్టేంట్ మరియు ఫ్రెండ్ అయిన సిరితో బిహేవ్ చేసిన పద్ధతి నచ్చక..చాలా మంది ఆయన్ను నెట్టింట తిట్టిపోశారు. వల్గర్ కామెంట్స్ తో ఆయన ఫాలోయింగ్ ను డ్యామేజ్ చేసారు. సీన్ కట్ చేస్తే.. టైటిల్ విన్నర్ అవ్వాల్సిన వాడు రన్నర్ గా మిగిలాడు.

ఇక షణ్ముఖ్ అభిమానులు ఊరుకుంటారా.. మొత్తం చేసింది సిరినే అంటూ మండిపడుతున్నారు. సిరి నే కావాలని షన్నుకి దగ్గరైంది అని..టైటిల్ గెలవలేకపోవడానికి కారణం  సిరినే అని భీబత్సంగా నెట్టింట ఆమెను  ట్రోల్ చేస్తున్నారు. అయితే రీసెంట్  గా బిగ్‌బాస్‌ బజ్‌ షో ఇంటర్వుల్లో మాట్లాడుతూ చాలా విషయాల పై క్లారిటీ ఇచ్చారు. సిరి విషయంలోను క్లారిటీ ఇస్తూ .."మేం ఫ్రెండ్స్ మాత్రమే అంతకన్నా మా మధ్య ఏం లేదు. దీప్తితో నా రిలేషన్ షిప్ ఎప్పటికి ఎండ్ కాదు" అంటూ చెప్పుకొచ్చారు.

ఇక అరియానా గ్లోరీ దీప్తి  హింట్ ఇచ్చిన విషయం గురించి మాట్లాడుతూ షణ్ముఖ్ ని ప్రశ్నించగా ..ఆయన మాట్లాడుతూ.."ఏంటి..దీప్తి నాకు హింట్ ఇచ్చిందా..ఎప్పుడు..నాకు తెలీదే. అయినా  దీపు అలాంటిది కాదు. నన్ను నమ్మండి మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నా. దీప్తి అలా చెప్పి ఉండదు. సరే.. ఒకవేళ దీపు నాకు హింట్ ఇస్తే మళ్లీ నేను ఎందుకు సిరితో అలా ఉంటాను.  సిరితో ఫ్రెండ్‌షిప్‌ ఎందుకు కంటిన్యూ చేస్తా చెప్పండి.  నాకు నా  పొజిషన్‌ గురించి 11వ వారంలోనే క్లారిటీ వచ్చేసింది. సన్నీ విన్నర్, నేను రన్నర్ అని ఊహించా" అంటూ బిగ్‌బాస్‌ బజ్‌ షోలో క్లారీటీ ఇచ్చాడు ఈ యూ ట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: