జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు నగ్నంగా చూడాలన్నాడు : హీరోయిన్

Divya
భారతదేశ సినీ పరిశ్రమలో హీరోయిన్లు మాత్రమే కాదు ఎంతోమంది నటీమణులు కూడా ఎంతోమంది దుర్మార్గుల కామ దాహానికి బలవుతున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్నా .. ప్రతి ఒక్క చోట కూడా ఈ చెత్త వ్యవహారం ఉందనే విషయం మీ టూ ఉద్యమం ద్వారా అమ్మాయిలు ధైర్యంగా చెప్పుకుంటున్నారు. సినిమాలలో అవకాశం పొందాలి అంటే ప్రొడక్షన్స్ మేనేజర్ నుండి దర్శకనిర్మాతల వరకు ఏదో ఒక కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని.. మరీ ముఖ్యంగా కొత్త వారైతే చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తారు అంటూ అప్పట్లో ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు కూడా పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.. ఇలా కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ కు బలి అవుతుంటే.. మరికొంతమంది మాత్రం అవకాశం లేకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీలో ఆఫర్లు రాకున్నా నష్టం ఏమీ లేదు అంటూ ఇలాంటి వాటికి దూరంగా జరుగుతున్నారు..

ఇకపోతే తాజాగా మరో హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించడానికి మీడియా ముందుకు వచ్చింది..ఆమె ఎవరో కాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన సుర్వీన్ చావ్లా.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒక జాతీయ అవార్డు గ్రహీత అలాగే ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తన సినిమాలో అవకాశం ఇస్తానని అంటూ పిలిచాడు. ఆయనతో కలిసి లొకేషన్ చూడడానికి రమ్మని ఫోన్ చేశాడు.. అయితే అక్కడికి వెళ్ళిన సమయంలో.. నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ గురించి కూడా నాకు తెలియాలి.. కాబట్టి డ్రెస్ విప్పి అలా నిల్చో అని అన్నాడు.. దాంతో నేను వెంటనే అక్కడి నుండి వచ్చేసాను ఎందుకంటే అతని తీరు.. మాటల్లో ఉద్దేశం నాకు అర్థం అయి అక్కడ మళ్ళీ ఎప్పుడు కూడా అడుగు పెట్టలేదు. కానీ అతను మాత్రం చాలా సార్లు ఫోన్ చేసి నన్ను విసిగించాడు.
 కానీ నేను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది..

జాతీయ అవార్డు గ్రహీత అమ్మాయిల తో ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు అంటూ మీడియా ముఖంగా వెల్లడించింది అమ్మాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: