పుష్ప సీక్రెట్ ను బయటపెట్టిన నార్కోస్ !

Seetha Sailaja

‘రంగస్థలం’ విడుదల సమయంలో సుకుమార్ పేరు తారాస్థాయికి చేరుకుంది. ఆమూవీని క్లాస్ మాస్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా విమర్శకులు కూడ ఆకాశానికి ఎత్తేసారు. ఆతరువాత సుకుమార్ నుండి వచ్చిన మూవీ ‘పుష్ప’ కావడంతో ఈమూవీ కూడ ‘రంగస్థలం’ మించి హిట్ అవుతుందని విపరీతమైన అంచనాలు వచ్చాయి.


అయితే ఈమూవీ విడుదలైన మొదటిరోజు మొదటి షో నుండి ఈమూవీకి డివైడ్ టాక్ రావడమే కాకుండా సుకుమార్ లాంటి గొప్ప దర్శకుడు నుండి రావలసిన స్థాయిలో ‘పుష్ప’ లేదు అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈవిమర్శలకు తోడు సుకుమార్ ఈమూవీ కథను అదేవిధంగా ఈమూవీలోని చాల సీన్స్ ను మక్కీకి మక్కీగా ‘నార్కోస్’ వెబ్ సిరీస్ నుండి కాపీ కొట్టారు అంటూ సుకుమార్ పై విపరీతమైన సెటైర్లు పడుతున్నాయి.

 
నార్కోస్ అనే వెబ్ పాబ్లో ఎస్కోబార్ అనబడే ఒక డ్రగ్ ట్రాఫికర్ జీవితకథ. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన డ్రగ్ మాఫియా డాన్ గా అతను ఎదిగిన తీరు కొలంబియా నుంచి అమెరికాకి డ్రగ్స్ ఎలా తరలించాడన్న కథను మార్చి డ్రగ్స్ బదులు శేషాచలం ఎర్రచందనం నేపధ్యంగా సుకుమార్ మార్చాడు అన్న విమర్శలు వస్తున్నాయి. నార్కోస్ పూర్తి స్థాయి స్పానిష్ వెబ్ సిరీస్ అయినప్పటికీ ఆ వెబ్ సిరీస్ ను ప్రపంచవ్యాప్తంగా అనేకమంది చూశారు. ఇందులో మన తెలుగువాళ్ళు కూడ ఉన్నారు. నెట్ ఫ్లిక్స్ లో చాలకాలం క్రితం ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అయింది.


ఆ వెబ్ సిరీస్ లోని చాల సీన్స్ ‘పుష్ప’ మూవీలో కనిపిస్తాయి. నార్కోస్ వెబ్ సిరీస్ లో  హీరో ఎలాంటి భయం లేకుండా నేరాలు చేస్తున్నట్లే ‘పుష్ప’ మూవీలో బన్నీ పాత్రను కూడ అలాగే డిజైన్ చేసారు. పోలీసులకు బన్నీ చిక్కినా ఎలాంటి భయం లేకుండా  నవ్వుతూ కనిపిస్తాడో నార్కోస్ వెబ్ సిరీస్ లో కూడ హీరో అలాగే ప్రవర్తిస్తాడు. నార్కోస్ వెబ్ సిరీస్ లో హీరో చీలీ దేశం నుంచి డ్రగ్స్ తరలించడానికి కార్ టైర్ల దగ్గర ఉన్న చోటుని ఎంచుకుంటాడు. అదేవిధంగా ‘పుష్ప’ మూవీలో బన్నీ ఎర్రచందనాన్ని పాల వ్యాన్స్ లో తరలిస్తాడు. ఇలా అనేక పోలికలు ‘నార్కోస్’ వెబ్ సిరీస్ కు ‘పుష్ప’ కు ఉండటంతో సుకుమార్ లో క్రియేటివిటీ తగ్గిపోయిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: