'ఎన్టీఆర్ తో సమంత'... ఈ సమయంలో పాజిటివ్ వార్తే?
ప్రస్తుతం అందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమాకి దాదాపుగా సామ్ నే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సమంత ఎన్టీఆర్ తో కలసి రభస, రామయ్య వస్తావయ్య, బృందావనం, జనతా గ్యారేజ్ వంటి పలు చిత్రాల్లో నటించారు. వీరిది సూపర్ హిట్ పెయిర్ అనే చెప్పాలి. అయితే ఇపుడు మళ్ళీ ఇన్నాళ్ళకి వీరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది భారీ బడ్జెట్ చిత్రం మాత్రమే కాదు. పాన్ ఇండియా చిత్రం కూడా అని మరో టాక్. అందుకే సామ్ కు గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు.
టాలీవుడ్ లోని క్రేజీ కపుల్స్ జంటల్లో తారక్, సామ్ లది కూడా ఒకటి. వీరు ఇరువురు కలిసి వెండి తెరపై కలిసి కనిపిస్తే ఆ మ్యాజిక్కే వేరు. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సామ్ పై కొంత నెగెటివ్ వైబ్రేషన్ ఏర్పడినప్పటికీ వ్యక్తిగత జీవితాన్ని తన కెరియర్ ని ఎపుడు కలిపి చూడకుండా జాగ్రత్త పడుతుంటారు సమంత.