బాలకృష్ణకు పోటీగా స్టార్ డాటర్..ఇక దబిడి దిబిడే...

VUYYURU SUBHASH
ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే యంగ్ హీరోలు కన్న సినీయర్ హీరోలే వరుస సినిమాలు చేస్తూ బిజీ గా తమ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్ హీరోలంత పాన్ ఇండియా మూవీలు అంటూ ఒక్కో సినిమాకి 3 ఏళ్లు, 4 ఏళ్లు టైం గడిపేస్తుంటే..సీనియర్ హీరోలు మాత్రం ఒక సినిమా చేస్తూనే మరో సినిమాను లైన్లో పెట్టేస్తున్నారు. ఈ విషయం చిరంజీవి. బాల కృష్ణ, నాగార్జున, వెంకటేష్ కాల్ షీట్లు చూస్తేనే మనకు అర్ధమైపోతుంది. యంగ్ హీరోలు ఒక్కే సినిమాకి స్టిక్ అయిపోతుంటే.. సీనియర్ హీరోలు మాత్రం ఒక్కేసారి రెండు సినిమాల షూటింగ్ లను కవర్ చేస్తూ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా నాలుగు సినిమాల షూటింగ్ స్టార్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇక నందమూరి బాలకృష్ణ అయితే అఖండ సినిమా చేస్తూనే మూడు ప్రాజెక్ట్లను లైన్లో పెట్టుకున్నారు. ప్రస్తుతం అఖండ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బాలయ్య..మొదటిసారి ఈ సినిమాతో తన కెరీర్ లోనే 100 కోట్లు కలెక్ట్ చేసాడు. దీంతో బాలయ్య నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. ఈ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి గోపీచంద్ మలినేని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
అఖండ తరువాత బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబో లో రాబోతున్న సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు   నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అనీ కూడా ఫినిష్ అయిపోయాయి.  ఈ సినిమాలో బాలకృష్ణ మనకి డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపించగా.. ఒక రోల్ లో  ఫ్యాక్షనిస్ట్ గా.. మరొక పాత్రలో  పోలీస్ ఆఫీసర్ గా మనల్ని మెప్పించబోతున్నట్లు  తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టబోయే విలన్ ఎవరో తెలిస్తే ఫ్యాన్స్ కు పూనకాలు రావడం పక్కా .  ఈ సినిమాలో బాలయ్యకు విలన్  పవర్ఫుల్ నెగిటివ్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ నటించబోతుంది అంటూ సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ఈమె పాత్ర ను దర్శకుడు గోపీచంద్ మలినేని హీరోకు సమానంగా డిజైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇది వరకే వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ సినిమాలో విలన్ గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది.  ఇక బాలయ్య పక్కన ఆమె నటిస్తే ఆమె కెరీర్ కు మంచి ప్లస్ అవుతుంది అంటున్నారు అభిమానులు. మరి చూడాలి ఈ లెడీ విలన్ కు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: