కోట్లు ఇచ్చినా సరే రకుల్ ఆ పని మాత్రం చేయదట..!!
తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి..తన టాలెంట్ ఏంటో అందరికి తెలిసేలా చేసింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో తెలుగు ప్రజలకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ..ఆ తరువాత తారక్ , అల్లు అర్జున్, చరణ్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించి తన పేరుని టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేర్చుకుంది. ఇక స్టార్ స్టేటస్ రాగానే బాలీవుడ్ చెక్కేసిన ఈ అమ్మడు.. అక్కడ కూడా తన అంద చందాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ గా ఉన్న రకుల్ మూవీల విషయంలో ఏమైనా చేస్తా కానీ ఆ ఒక్క పని మాత్రం చేయను అంటుంది. యస్..అమ్మడు సినిమాల్లో ఎలాంటి రోల్ అయినా చేస్తుందట .. సినిమా కోసం ఎంతైనా కష్టతుందట .. కానీ బరువు పెరగడం, తగ్గడం లాంటివి అస్సలు చేయను అంటుంది. ఒక్కవేళ ఏ డైరెక్టర్ అయినా వచ్చి ఇలా మాత్రం చేయమంటే నా వల్ల కాదు..కోట్లు ఇచ్చినా నేను అలా చేయను అంటుంది ఈ పంజాబీ భామ. ఎందుకంటే..బరువు అనేది సహజమైన ప్రక్రియ..ఎవరు కావాలని బరువు పెరిగినా, తగ్గినా అది చాలా డేంజర్. మన శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ తరువాత అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది. సో..నేను తెలిసి తెలిసి ఆ తప్పు చేయకూడదు అని డిసైడ్ అయ్యాను అంటుంది రకుల్.