శ్యామ్ సింగ్ రాయ్ లో నాని నిజ జీవిత ఛాయలు !
వచ్చేవారం విడుదలకాబోతున్న ఈ మూవీ ట్రైలర్ చూసినవారికి ఇది కూడ డిసెంబర్ హిట్స్ లిస్టులో చేరిపోతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కమర్షియల్ అంశాలతో పాటు నాని అద్భుతమైన నటన ఈ మూవీలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ ట్రైలర్ చూసినవారికి అర్థం అవుతుంది. మూవీ ట్రైలర్ ను బట్టి వాసు పాత్రలో నటిస్తున్న నాని సినిమాల పై తనకు ఉన్న మోజుతో ఫిలిం ఇండస్ట్రీకి రావడం అక్కడ రాణించడానికి అనేకపాట్లు పడటం చాల ఫన్నీగా చూపెట్టారు.
నిజ జీవితంలో కూడ నాని సినిమాల పై ఉన్న మోజుతో ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారంభించి ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోలలో టాప్ హీరో స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం నాని టాప్ యంగ్ హీరోల రేస్ లోకి ఎంటర్ అవ్వడానికి తన ‘శ్యామ్ సింగ్ రాయ్’ మూవీ ద్వారా ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం టాప్ హీరోల సినిమా జాతర కొనసాగుతోంది. ‘పుష్ప’ మ్యానియా కొనసాగుతూ ఉంటే జనవరి మొదటివారంలో రాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా ఆకాశాన్ని అంటుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ రెండు భారీ సినిమాల మధ్య నలిగిపోతామా అని అందరూ ట్రై చేస్తుంటే ఏ ధైర్యంతో నాని తన లేటెస్ట్ మూవీని ఈ రెండు సినిమాల మధ్య ధైర్యంగా నిలిపే సాహసం చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి..