రిలీజ్ కు ముందే పుష్ప అదిరిపోయే రికార్డ్..!

NAGARJUNA NAKKA
మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 వేల థియేటర్లలో విడుదలవుతున్న ఈ మూవీ విడుదలకు ముందే సరికొత్త రికార్డు సృష్టించింది. పుష్ప మూవీకి బుక్ మైషోలో 8లక్షలకు పైగా ఇంట్రెస్టెడ్ లైక్స్ వచ్చాయి. ఇది సరికొత్త రికార్డు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో ఈ రెస్పాన్స్ బట్టి అర్థమవుతోంది.
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప మరి కొద్ది గంటల్లో విడుదల కానుంది. ఇప్పటికే దాదాపు అన్ని థియేటర్లలో టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ క్రమంలోనే టికెట్స్ లేదా పుష్పా అంటూ డైరెక్టర్ మారుతి తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హైదరాబాద్ లో మార్నింగ్ షో టికెట్లు కావాలని అందులో రాసుకొచ్చాడు. దానికి హీరోయిన్ రాశీఖన్నా స్పందిస్తూ.. కష్టం సర్.. నేను కూడా ప్రయత్నం చేస్తున్నా.. అని రిప్లై ఇచ్చింది.
హైకోర్టు ఆదేశాలతో రేపు విడుదల కానున్న పుష్ప సినిమాకు ప్రభుత్వం గతంలో నిర్ణయించిన టికెట్ల రేట్లే అమలు కానున్నాయి. థియేటర్ల యజమానులు టికెట్ల ధరలను ఎంత మేర పెంచుతున్నారనే ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ కు సమర్పించాలని.. ఆయనే నిర్ణయం తీసుకుంటారని కోర్టు స్పష్టం చేసింది. అయితే జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించి థియేటర్ యజమానులు చెప్పినట్టు నడుచుకునే పరిస్థితి లేదు.
మరోవైపు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఇచ్చిన జీవో పై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని ఆదేశించింది. టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: