ఒక్క వీడియో ఆయన జాతకానే మార్చేసిందిగా..!!

VUYYURU SUBHASH
 కోట్లాది మంది అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరో మరో మూడు రోజుల్లో తెలియనుంది. ఫైనల్ ఎపిసోడ్ దగ్గరపడడంతో హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ కు టెన్షన్ మొదలైంది. అందరు ఇన్ని రోజులు కష్ట పడి ఆట ఆడినా కేవలం ఎవరో ఒక్కరే విన్ అవుతారు. ఈ విషయం హౌస్ మేట్స్ కి తెలిసిందే.
ఇక సోషల్ మీడియాలో అయితే ప్రధానంగా సన్నీ నే విన్నర్ అంటూ ప్రచారం జరుగుతున్నా..మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ల ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్లు వేసి గెలిపించడానికి స్దాయి శక్తుల ట్రై  చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం..ఓటింగ్ పరంగా టాప్ 1 లో సన్నీ, టాప్2 లో శ్రీరామ చంద్ర, టాప్ 3 లో షణ్ముఖ్ ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే, ఇప్పటీకే స్టార్ సెలబ్రిటీస్ శ్రీరామ చంద్రకు సపోర్ట్ చేస్తూ ఉండగా..ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ప్రభాస్ ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యింది. యస్..  రీసెంట్ గా కృష్ణంరాజు భార్య  ప్రభాస్‌ పెద్దమ్మ అయిన శ్యామల దేవి శ్రీరామ చంద్రకు సపోర్ట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.." హాయ్‌ శ్రీరామ్‌. మేము బిగ్‌బాస్‌ షో చూస్తున్నాం. నీ ఆట బాగా ఆడుతున్నవ్. మాకు నీ పాటలు అంటే  చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా నువ్వు పాడే భక్తి పాటలు అంటే చాలా ఇష్టం. అప్పుడు ఇండియన్‌ ఐడెల్‌లో గెలిచి తెలుగువారందరకీ ఎంతో గర్వకారణం అయిన నువ్వు..ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ కూడా గెలవాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ " అంటూ వీడియో రిలీజ్ చేసారు. ఇక దీంతో శ్రీరామ చంద్ర ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ శ్రీరామ చంద్ర ఖచ్చితంగా గెలుస్తాడు అంటున్నారు నెటిజన్స్.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: