సమంత మ్యానియాతో రష్మిక ఖంగారు !
దీనితో ప్రస్తుతం ఆమె ఈ వారం రిలీజ్ కాబోతున్న ‘పుష్ప’ పై భారీ అంచనాలు పెట్టుకుంది. వాస్తవానికి ఈమూవీలో ఆమెది డీ గ్లామర్ రోల్. అయినప్పటికీ ఈ మూవీతో ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోతానని కలలు కంటోంది. దీనికి తగ్గట్టుగానే ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆమె చాల గ్లామర్ గా తయారై ఆ వేడుకకు రావడమే కాకుండా వేదిక ఎక్కి నాలుగు వైపులా తిరుగుతూ యూత్ ను ఆకట్టుకోవడానికి గాలిలో ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చింది.
ఆ కార్యక్రమానికి వచ్చిన యూత్ కూడ రష్మిక ప్రయత్నాలకు మంచి స్పందన ఇచ్చారు. అయితే ఒక్కసారిగా ఆ ఈవెంట్ లో సమంత స్పెషల్ సాంగ్ విడుదల కాగానే ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా రష్మిక గురించి కాకుండా సమంత గురించి విపరీతంగా మాట్లాడుకోవడం రష్మిక కు షాక్ ఇచ్చినట్లు టాక్. ఇక ఈమూవీలో రష్మిక నటించిన ‘సామి సామి’ పాట వీడియో కంటే సమంత స్పెషల్ సాంగ్ వీడియో ‘ఊ అంటావా’ కు విపరీతమైన స్పందన రావడం కూడ రష్మికను ఖంగారు పెడుతున్నట్లు టాక్.
గతంలో కాజల్ ‘జనతా గ్యారేజ్’ లో ఐటమ్ సాంగ్ చేసినప్పుడు ఆనాడు యూత్ అంతా ఆ మూవీలో నటించిన సమంత గురించి కంటే కాజల్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి తనకు రిపీట్ అయి తాను పడిన కష్టం అంతా వృధా అయిపోతుండా అన్న భయాలు కూడ రష్మికను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది..