హీరోలు ఆమె కోసం వెయిట్ చేస్తారు.. నాని కామెంట్స్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో గా ఎంట్రీ ఇచ్చిన నానీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.. ఇక ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల నాచురల్ స్టార్ గా కొనసాగుతున్నాడు నాని. ఇకపోతే నాని మరికొన్ని రోజుల్లో శ్యామ్ సింగరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది.

 శ్యాం సింగరాయి సినిమాలో నాని రెండు షేడ్స్ లో నటించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాచురల్ స్టార్ నాని. ఏకంగా యాంకర్ సుమ ని ఆకాశానికెత్తేసి ప్రశంసల వర్షం కురిపించాడు.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన నాని డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోల డేట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హీరోల డేట్లు కుదిరినప్పుడు సినిమాలు చేస్తూ ఉంటారు.

 కానీ హీరోలు మాత్రం యాంకర్ సుమ డేట్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు అంటూ నాచురల్ స్టార్ నాని అన్నారు. కేవలం ఒక్క హీరో మాత్రమే కాదు అందరూ హీరోలు కూడా యాంకర్ సుమ డేట్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవాలన్నా.. సినిమాకు సంబంధించి ఏదైనా ఫంక్షన్ చేయాలన్న కూడా సుమ డేట్స్ చూసుకున్న తర్వాతనే ప్లాన్ చేస్తూ  ఉంటారు హీరోలు అంటూ ఏకంగా సుమని ఆకాశానికి ఎత్తేశాడు నాచురల్ స్టార్ నాని. ఇక శ్యామ్ సింగరాయి సినిమా విషయంలో ఎలాంటి భయం లేదని ఎందుకంటే అంత అద్భుతంగా సినిమా వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: