ఈ ఏడాది..గూగుల్లో ఎక్కువ వెతికిన సినిమాలు ఇవే..!

Divya
ఇక ఈ ఏడాది కొద్దిరోజుల తో ముగియనుంది. అయితే తాజాగా ఈ సినిమా ఎక్కువగా నెట్టింట్లో అందరూ సెర్చ్ చేశారు అనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ఇందులో ఎక్కువగా ఇతర భాషల సినిమాలు ఉన్నాయి. మన తెలుగు సినిమాలు ఒక్కటి కూడా లేవు. ముఖ్యంగా హిందీ, తమిళ భాష వంటి సినిమాలే లిస్టులో బాగా మంచి స్థానాన్ని దక్కించు కున్నాయి. కేవలం సూర్య లాంటి హీరోలు మాత్రమే గూగుల్ లో తమ సత్తాను చాటి చూపించారు.ఇక అందులో ఏ సినిమా లు ముందువరుసలో ఉన్నాయో చూద్దాం.

1). జై భీమ్:
ఈ సినిమాలో సూర్య  సొంతంగా ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ చిత్రం గూగుల్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.
2). షేర్ షా:
పంజా డైరెక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో కథానాయకుడిగా సిద్ధార్థ మల్హోత్రా నటించారు. ఈ సినిమా రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
3). రాదే:
సల్మాన్ ఖాన్ హీరోగా, హీరో ప్రభుదేవా డైరెక్షన్ లో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మూడో స్థానాన్ని దక్కించుకుంది.
4). బెల్-బాటమ్:
అక్షయ్ కుమార్ ఈ సినిమాలో హీరో గా నటించారు. కరోనా తగ్గిన తరు వాత విడుదలైన అప్పటికీ ఆకట్టుకోలేకపోయింది. ఇది నాలుగవ స్థానం.దక్కించుకుంది.
5). ఎటర్నల్:
హాలీవుడ్లో ఇలాంటి సినిమాలకు బాగా డిమాండ్ ఉందని చెప్పవచ్చు. అందుకోసం ఈ సినిమా టాప్ ఫైవ్ లో ఉన్నది.
6). మాస్టర్:
విజయ్ హీరో గా, విజయ్ సేతుపతి విలన్ గా.. డైరెక్టర్ లోకేష్ కనుక రాజ్ ఈ సినిమాని తెరకె క్కించారు.ఇది ఆరవ స్థానాన్ని దక్కించుకుంది.
7). సూర్య వంశీ:
అక్షయ్ కుమార్ హీరో గా తర్వాత సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా ఏడవ స్థానాన్ని దక్కించుకుంది.
అలాగే 8వ స్థానంలో గాడ్జిల్లా వర్సెస్  కాంగ్, తొమ్మిదవ స్థానంలో దృశ్యం-2(మలయాళం), పదవ స్థానంలో భు జ్ దక్కించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: