గుడ్ న్యూస్ : RRR నిర్మాతతో చిరు సినిమా కన్ఫర్మ్.. డైరెక్టర్ ఎవరంటే..?

Anilkumar
టాలీవుడ్ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో జెడ్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు చిరు. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న చిరంజీవి ప్రస్తుతానికైతే వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరు మరోవైపు తనకు నచ్చిన కథ లను ఓకే చేస్తూ  వెళ్తున్నాడు. ఇప్పటికే కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాని పూర్తి చేశాడు చిరంజీవి. ఈ సినిమాలో చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజ హెగ్డే కీలకపాత్రలు పోషించారు.


ఇక ఈ సినిమాతో పాటు గాడ్ఫాదర్, భోళా శంకర్ , దర్శకుడు బాబి తో మరో సినిమా.. ఇలా వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు మెగాస్టార్. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నట్లు గా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ముందు నుంచి వినిపిస్తున్నట్టుగానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాని టాలీవుడ్ అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.


ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా డిడివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్ర బృందం ప్రకటించబోతున్నట్లు గా తెలుస్తోంది. ఇక యువ దర్శకుడిగా వరుస విజయాలు అందుకున్న వెంకీ కుడుముల మొదటిసారి మెగాస్టార్ తో సినిమా చేయనుండంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చిరు ప్రస్తుతం నటిస్తున్న తన 3 సినిమాల షూటింగ్స్ లో సమాంతరంగా పాల్గొనబోతున్నాడు.ఇక ఈ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతుండటం విశేషం...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: