సింగర్ గా మారిన దిల్ రాజు..ఇది మామూలు షాక్ కాదుగా..!!

VUYYURU SUBHASH
 టాలీవుడ్ లో దిల్ రాజు అనే పేరుకి ఓ స్పెషల్ స్దానం ఉంది. సినిమా ఇండస్ట్రీలో అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్న ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు అనడంలో సందేహం లేదు. ఒకటి కాదు రెండు కాదు..వరుస బ్లాక్ బస్టర్ హిట్ లతో దూసుకుపోతూ సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న దిల్ రాజు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నిర్మాతగా దూసుకుపోతున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూట‌ర్‌గా తన సినీ కెరీర్ ని స్టార్ట్ చేసి.. 2003లో నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమాతో నిర్మాత‌గా మారి బ్లాక్ బస్టర్ విజయం అందుకుని...తనకు హిట్ ఇచ్చిన సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు దిల్ రాజు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీని శాసించే వ్య‌క్తుల్లో దిల్ రాజు టాప్ ప్లేస్ లో ఉండడం గమనార్హం. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కధ నచ్చితే ఆ సినిమాను ఓకే చేస్తున్నారు ఈయన. ప్రస్తుతం దిల్ రాజు చేతిలో ఐదు బడా సినిమాలు ఉన్నాయి. ఇక చరణ్ హీరోగా శంకర్ డైరెక్టర్ గా చేస్తున్న మూవీ కోసం ఈయన ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
తాజాగా నిర్మాత దిల్ రాజ్ సింగర్ అవతారమెత్తాడు. దీంతో ఈయన లోని మంచి గాయకుడు బయటపడ్డాడు.తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో ‘అమిగోస్ డ్రైవ్ ఇన్’ రెస్టారెంట్ ఓపెనింగ్ కు వెళ్లిన  దిల్ రాజుని అక్కడ మ్యూజికల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇస్తున్న బ్యాండ్ స్టేజి పైకి పిలిచి... తమతో పాటు కలిసి పాడాల్సిందిగా కోరడంతో.. దీంతో ఆయన నో అనలేక ఇబ్బందిగానే మైక్ తీసుకుని లాస్ట్ కి ఫుల్ ఎంజాయ్ చేస్తూ “హలో గురు ప్రేమ కోసమే జీవితం” అంటూ అద్భుతంగా పాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఆయన పాట పాడిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: