నాగ చైతన్య పై రివేంజ్ సమంత అలా తీర్చుకుందా..?
ఇక వీళ్లు విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ లో హాట్ గా కనిపించడమే అంటూ వార్తలు వినిపించాయి. ఆ వెబ్ సిరీస్ లో సమంత రాజీ అనే పాత్రలో కొంచెం బోల్డ్ గానే నటించింది. అక్కినేని ఇంటి కోడల్లు అలాంటి హాట్ లుక్స్ లో కనిపించడంతో అప్పట్లో దాని పై పెద్ద దుమారమే రేగింది. ఇక సీన్ కట్ చేస్తే ఆ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన కొన్నాళ్ల తరువాత సమంత నాగచైతన్య విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది.
కాగా, రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన "పుష్ప" అనే సినిమాలో అల్లు అర్జున్ పక్కన సమంత ఓ ఐటెం సాంగ్ చేసి అభిమానులకు సడెన్ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ పాటలో సమంత హాట్ లుక్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. పెళ్లి తరువాత సమంత బయట ఎప్పుడు ఇలాంటి హాట్ డ్రెస్సులతో కనిపించలేదు. కానీ విడాకుల తరువాత ఇలా రూట్ మార్చే సరికి ..నాగచైతన్య పై రీవేంజ్ తీర్చుకోవడానికే ఇలాంటి సాంగ్స్ కు ఓకే చెబుతుంది అంటున్నారు నెటిజన్స్. మరి నిజంగా సమంత చై పై కోపంతోనే ఇలా చేసిందా..?