ఆర్ఆర్ఆర్ : టికెట్ల ధరపై నిర్మాత డీవీవీ ఏమన్నారంటే..?
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్రబృందం. ఈ తరుణంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసారు చిత్రయూనిట్. శనివారం ఉదయం నిర్వహించిన ఆర్ఆర్ఆర్ విలేకర్ల సమావేశంలో ప్రొడ్యూసర్ దానయ్య ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం దాదాపుగా 1600 థియేటర్లు ఉన్నాయని.. ఏపీలో 1000 థియేటర్లు, తెలంగాణలో 600 థియేటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఆంధప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంలోనే సమస్య ఎదుర్కొంటున్నది చిత్రపరిశ్రమ.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 రూపాయలు, మున్సిపాలిటీ పరిధిలో 60 రూపాయలు, పంచాయతీ పరిధిలో 20 రూపాయలు మించకుండా టికెట్ రేట్లు ప్రభుత్వం నిర్ణయించినది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినది. ఆ టికెట్ రేటు విషయంలో కొంత వెసులుబాటు ఇస్తే ఆన్లైన్ సిస్టమ్ కు ఓకే అంటోంది సినిమా పరిశ్రమ అని చెప్పారు. అయితే ఆ రేట్లతో థియేటర్లు నడపడం సాధ్యం కాదని, రేట్ల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేసారు. ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో మీరు ఎన్టీఆర్ సాయం ఏమైనా తీసుకుంటారా? ఎందుకంటే ఎన్టీఆర్‌కు ఆప్తులైన ఇద్దరు వ్యక్తులు అక్కడ మంచి స్థాయిలో ఉన్నారు కదా? అని ప్రశ్నించగా.. ‘‘సినిమా టికెట్ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం అని.. త్వరలోనే ఓ కొలిక్కి వస్తోందని భావిస్తున్నట్టు వెల్లడించారు డీవీవీ దానయ్య.