ఆర్‌ఆర్‌ఆర్ : దేశభక్తి కాదు.. ఫ్రెండ్‌షిప్..!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసిందని, రెట్టించిన ఉత్సాహంతో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకున్నామని, గతంలో నేను చదివిన పుస్తకాలే నా సృజనాత్మకతకు కారణం అని రాజమౌళి చెప్పారు. ఇక ఈ సినిమా ఫిక్షనల్ స్టోరీ అని, దేశ భక్తి సినిమా కాదు అని, స్నేహం నేపథ్యంలో పూర్తి కథ కొనసాగుతుందని రాజమౌళి వెల్లడించారు. దేశభక్తి ఓ భాగం మాత్రమే అని, తారక్, చెర్రీ పాత్రలను సమానంగా తీర్చిదిద్దానని మీడియాకు వివరించారు. నాటు నాటు పాట కోసం చాలా కష్టపడ్డారని, ఈ పాటకు సంబంధించి మీకు రెండు, మూడు స్టెప్పులు మాత్రమే చూపించాను. ఇంకా ఇందులో చాలా ఉన్నాయని రాజమౌళి వివరించారు.
అదేవిధంగా 'దోస్తి దోస్తి' పాట కోసం సిరివెన్నెలతో పనిచేయడం చాలా అద్భుతం అని, ఆయనతో పాట రాయించుకోవాలంటే చాలా వేరుగా ఉంటుంది అని.. సిరివెన్నెల పాట రాయాలంటే చిత్రంలో పాత్రలు, విధానాలు అన్నీ వివరిస్తే రెండు, మూడు నెలలు సమయం తీసుకొని పాటను రాస్తారు. అద్భుతమైన పాటలు రాసేవారు అని గుర్తు చేసారు. ఇక కొమురం భీమ్ గురించి తెలియనివి చాలా ఉన్నాయని, అడవి మనిషి నడవడిక ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించాం.
ఆర్ఆర్ఆర్ కథ 90 శాతం ఢిల్లీలో జరిగినది అని.. 1920 నేపథ్యంలో ఈ కథ తెరకెక్కించాం అని చెప్పారు. కేవలం కథ ప్రేక్షకులను థియేటర్ల వద్దకు తీసుకొస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ట్రైబల్ తెగలు ఎలా ఉండేవారు, వారి కట్టు, బొట్టు, వ్యవహారం గురించి కాకుండా.. గిరిజనుల సామ్రాజ్యం ఏవిధంగా ఉందని, కొమురం భీమ్ ఎప్పుడు ఏ విధంగా ఉన్నారని.. గిరిజనుల మానసిక స్థితి ఏవిధంగా ఉన్నది. ఉన్నట్టుండి వారు సిటీకి వస్తే వారు ఏవిధంగా ఉంటారని కొమురం భీమ్ పాత్ర గురించి తెరకెక్కించామని చెప్పారు దర్శక ధీరుడు. అదేవిధంగా అల్లూరి సీతారామారాజు యోగా సాధన చేసిన యోగిగా.. ఆయన వ్యక్తిత్వం అప్పుడు ఏవిధంగా ఉన్నదని, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆయన ఏ విధంగా వ్యవహరించాడని.. వ్యక్తిత్వమే తాము ఎక్సర్‌సైజ్ చేశామని రాజమౌళి మీడియాకు వెళ్లడించారు.