'చై - సామ్' లను కలపడానికి సామ్ ఫ్రెండ్ ప్రయత్నాలు?

VAMSI
సినిమా రంగంలో ఎంతో మంది కలిసి పనిచేస్తూ ఉంటారు. వృత్తి దర్మం ప్రకారం లింగ బేధం లేకుండా కలిసి ఉండాల్సి వస్తుంది. ఈ విషయాన్ని చాలా వరకు పట్టించుకోరు. కానీ కొంత మంది ఆర్టిస్ట్ లు అయితే కొంత మందితో బాగా కనెక్ట్ అయిపోతారు. అది నటుడు కావొచ్చు, లేదా నటీమణి కావొచ్చు. ఈ విధంగా చాలా సార్లు అలా కనెక్ట్ అయి పెళ్లి వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.  అదే విధంగా మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మరియు తమిళ భామ సమంత కలిసి చేసిన ఒక సినిమా వీరి జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతుందని ఎవరూ అనుకుని ఉండరు. కానీ వీరి లైఫ్ లో జరిగింది చూస్తే కొందరికి అయ్యో.. అనిపిస్తుంది. మరి కొందరికి వీరికి ఇలాగే జరగాలి అనుకుంటూ ఉంటారు.
అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది వారిద్దరికీ మాత్రమే తెలుస్తుంది. వీరు కలిసి ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అంతా బాగుంది కానీ కొంతకాలం నుండి వీరిద్దరూ సఖ్యంగా ఉండడం లేడనై వార్తలు బయటకి వచ్చాయి. అయితే అందరూ ఇవి మాములుగా వచ్చే రూమర్లే కదా అని కొట్టిపారేశారు. అయితే అక్టోబర్ లో సమంత నాగచైతన్య ఇద్దరూ విడిపోతున్నాం అని సోషల్ మీడియా ద్వారా చెప్పక తెలిసింది. ఇదంతా నిజమే అని, దీనిపై దాదాపుగా చాలా చర్చలు జరిగాయి.
ఇప్పుడు ఎవరికి వారు విడిపోయి ప్రశాంతంగా తమ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ వీరిద్దరి అభిమానులు మాత్రం ఇంకా సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక విధంగా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇటీవల సమంత ఫ్రెండ్ ఒకరు మళ్ళీ వీరిద్దరినీ కలపడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ ఇలాగే జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది నిజమవ్వాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: