మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేసిన తర్వాత ఇంతటి స్థాయికి ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయడం చరణ్ కెరియర్ కు ఎంత ప్లస్ అవుతుంది. అయితే ఈ సినిమా చేయడం పట్ల మెగా అభిమానులు ఒకవైపు సంబరాలు చేసుకుంటున్న మరొకవైపు ఎంతో టెన్షన్ పడుతున్నారట. దానికి కారణం లేకపోలేదు. దర్శకుడిగా శంకర్ కు సౌత్ సినిమా పరిశ్రమలోనే భారీ గా పేరు ఉంది.
ఆయన సినిమా చేస్తే తప్పకుండా నిర్మాతలకు కాసుల పంట అనే పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవడం గగనమైపోయింది. భారీ బడ్జెట్ చిత్రాలను చేసి భారీగా విడుదల చేసి భారీ హిట్ అందుకోవడం శంకర్ స్టైల్. అయితే ఇదంతా ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి అంతగా బాగోలేదు. తమిళనాట హీరోలు అవకాశాలు ఇవ్వకపోవడంతోనే తెలుగు కు వచ్చి ఇక్కడ సినిమాలు చేయడం మొదలు పెట్టారని తమిళనాడులో ఒక టాక్ కొనసాగుతుండగా తాజాగా తెలుగులో ఆయన చేసిన మొదటి చిత్రం ఆగి పోయే విధంగా పరిస్థితి అవ్వడం ఇప్పుడు మెగా అభిమానులను ఎంతగానో కలవరపరుస్తోంది.
రామ్ చరణ్ సినిమాను మొదలు పెట్టకముందే ఆయన కమల్ హాసన్ తో కలిసి ఇండియన్ 2 అనే సినిమాను మొదలుపెట్టి మధ్యలో ఆపేశాడు. దానికి కారణాలు ఎన్ని ఉన్నా కూడా ఒక పెద్ద దర్శకుడు చేస్తున్న సినిమా ఆగిపోవడం అంటే అది ఆయనకు ఎంతో అవమానం అన్నమాట. అలాంటిది ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హీరో అయిన చరణ్ తో సినిమా చేయడం విశేషం. అయితే తాజాగా ఇండియన్2 నిర్మాతలు ఆ చిత్రాన్ని పూర్తి చేశాక కానీ చరణ్ సినిమా చేయవద్దని చెప్పటంతో శంకర్ కూడా ఆ సినిమా చేయాలని భావిస్తున్నడంతో చరణ్ సినిమాను కొన్ని రోజులు పోస్ట్ ఫోన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.