లుక్స్ మీద పెట్టిన ఫోకస్ స్టోరీ మీద పెట్టాల్సింది..!!

P.Nishanth Kumar
భద్ర సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చాలా సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాయి. చాలామంది హీరోలకు ఆయన భారీ మాస్ హిట్ లు ఇచ్చి వారిని మాస్ హీరోలుగా మలిచాడు అని చెప్పవచ్చు. ఆవిధంగా బోయపాటి శ్రీను చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు అఖండ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని గట్టి నమ్మకంతో ఉన్న బోయపాటి శ్రీను ఈరోజు ఈ సినిమా నుంచి వచ్చిన ఫలితం నిరాశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు.

మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ భావించగా సినిమాలో కొన్ని మైనస్ లు చిత్రంపై భారీగా ఎఫెక్ట్ చూపించాయని తెలుస్తోంది. ముఖ్యంగా కథా కథనాల విషయంలో బోయపాటి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు లేదు అని ప్రేక్షకులు సైతం చెబుతున్నారు. ఇక క్రిటిక్స్ సంగతి సరే సరి.. మంచి సినిమాకి లోపాలు ఎత్తి చూపించే వారు ఇన్ని లోపాలున్న ఈ సినిమాను మరింతగా వేలెత్తి చూపిస్తూ సినిమా టాక్ నే మార్చేస్తున్నారు. ఆ విధంగా బోయపాటి శ్రీను ను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ కొంత కలవరపాటుకు గురి అవుతుంది.

వాస్తవానికి ఈ సినిమా లో బాలకృష్ణ గెటప్ అనేది ఒకటి పక్కన పెడితే మిగతా వారిని కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాడు అని అందరూ చెబుతున్నారు.గెటప్ ల మీద పెట్టిన దృష్టి కథ కథనాల మీద పెడితే ఇంకా బాగుండేది అని కూడా సలహా ఇస్తున్నారు ప్రేక్షకులు. ఏదేమైనా  భయపడి శీను ఇప్పుడు భారీగానే బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సినిమాతో ఆ బ్యాడ్ టైం కు స్వస్తి చెప్పాలని భావించిన ఆయనకు ఇప్పుడు అది కుదరదు అని తెలుస్తోంది. మరొక సినిమా తో బోయపాటి శ్రీను హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా అవకాశం ఇచ్చే హీరో ఎవరో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: