మెహారీన్ ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్.. దశ మారినట్లే!!

P.Nishanth Kumar
టాలీవుడ్ హీరోయిన్ మెహరిన్ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం తో టాలీవుడ్ లో పరిచయమై ఆ తర్వాత వరుస మంచి సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మంచి సినిమాలే ఉన్నాయని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ తో కలిసి ఆమె ఎఫ్3 సినిమా చేస్తుండగా ఆ తర్వాత కూడా ఆమె అదే విధంగా దూసుకు వెళుతుంది అని చెప్పొచ్చు. మధ్య లో ఆమె పెళ్లి చేసుకోబోతుందని కొన్ని వార్తలు వచ్చాయి.

అవి నిజమే అయినా కూడా తన ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుని ఆమె మళ్లీ సినిమాల్లోకి రావడం ఆమె అభిమానులను ఎంతగానో ఆనందపరిచింది. కొన్ని అభిప్రాయాలు భేదాల కారణంగా ఈమె ఆల్రెడీ జరిగిన ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది. వస్తూ వస్తూనే నాజుగ్గా మారి ప్రేక్షకులను అలరించే ఆకారంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది. బాలీవుడ్లో సైతం ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. మొదట్లో బొద్దుగా కనిపించి ప్రేక్షకుల చూపు తనవైపుకు తిప్పుకోలేకపోయింది. కానీ ఇటీవలే ఆమె బరువు తగ్గి నాజూగ్గా మారడం తో అందరూ ఒక్కసారిగా వైపు చూడటం మొదలుపెట్టారు.

దాంతో పాటే ఆమెకు అవకాశాలు కూడా గట్టిగానే వస్తున్నాయి. కన్నడ సినిమా పరిశ్రమ సైతం ఆమె తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె కు ఫ్లాప్ లు ఎదురవుతున్న కూడా ఆమెకు అవకాశాలు రావడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ఆమెకు మంచి అదృష్టాన్ని తీసుకువస్తుందా అనేది చూడాలి. తాజాగా ఆమెకు మెగా అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు ఈమెనే హీరోయిన్ గా అనుకుంటున్నారట చిత్ర బృందం. మరి ఈ చిత్రంలో ఆమె నటనకు అవకాశం వస్తే ఆమె దశ మారినట్లే అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: