'సిరివెన్నెల'కు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఈయనే?

VAMSI
టాలీవుడ్ లో ప్రముఖ పాటల రచయిత అనగానే గుర్తొచ్చే మొదటి పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రి. పదాలతో ప్రయోగం చేయడం, అలాగే వాటిని ప్రేక్షకులకు నచ్చే బాణీలో సమకూర్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అక్షరాల వెల్లువలో తెలుగు ప్రేక్షకుల మనసులను తడిపిన మహా సంద్రం. పదాల పువ్వులతో లక్షలాది హృదయాలను పులకరింప చేసిన పారిజాత వృక్షం. ఇలా ఆయన కీర్తిని చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. పాటల పూదోటలో ఏ పదాన్ని ఎలా వాడితే ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు అవుతారో తెలిసిన మహా జ్ఞాని. ఈయన పాట రాశారు అంటే అది ప్రతి నోట ఆలపించాల్సిందే. అంతగా ఆయన పదజాలం అధ్బుతంగా ఉంటుంది.
శాస్త్రీయమైనా, సందేశాత్మకమైనా, ప్రణయమైనా, భావోద్వేగాలను ఉప్పొంగించే అత్యంత సరళమైన పదాల్ని అర్థవంతంగా, సులభంగా అందించడంలో సిరివెన్నెల మహా దిట్ట. ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కె.విశ్వనాధ్ ఈయన్ను ఇండస్ట్రీకి పాటల రచయితగా పరిచయం చేశారు. 'సిరివెన్నెల' సినిమాకి తొలి సారి పాటలను రచించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆ సినిమా హిట్ అవ్వడమే కాదు ఆల్బమ్ అంతకు మించిన సూపర్ హిట్ ను అందుకుంది. ఏ నోట విన్నా ఆ సినిమా పాటలే. అంత అర్థవంతంగా, అలవోకగా, అద్భుతంగా రచించారు సిరివెన్నెల. సంగీతం కూడా ప్రేక్షకులను  అంతే పదాలకు తోడై ఆకట్టుకుందని చెప్పాలి.
ఇక అప్పటి నుండి సిరివెన్నెల వెనుతిరిగి చూసింది లేదు. అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. మహా మహా దర్శకులు సైతం ఈయన డేట్స్ కోసం ఎదురు చూసి మరి పాటలు రాయించుకునేవారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అన్నట్టుగా ఆయన ఎంతో సాదా సీదాగా ఉంటారు. ఆయన పదాలు ఎంత గౌరవంగా ఉంటాయో ఇతరులతో ఆయన మాటలు కూడా అంతే గౌరవంగా ఉంటాయి.  చిన్న,పెద్ద ప్రతి ఒక్కరినీ ఎంతో మర్యాదగా పలకరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: