రాంబాబుగా మరొకసారి అదరగొట్టిన వెంకీ .... ??

GVK Writings
విక్టరీ వెంకటేష్ హీరోగా ఇటీవల తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన సినిమా దృశ్యం. మలయాళం లో మోహన్ లాల్ హీరోగా యువ దర్శకుడు జీతూ జోసెఫ్ తీసిన దృశ్యం మూవీ అక్కడ పెద్ద విజయాన్ని అందుకొవడంతో పాటు ఇటు తెలుగులో కూడా భారీ సక్సెస్ అందుకుంది. దానితో తదుపరి రానున్న దృశ్యం 2 పై అందరిలో భారీగా అంచనాలు పెరిగాయి. ఇక ఇటీవల దృశ్యం 2 మలయాళ వర్షన్ రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టడంతో తెలుగులో రానున్న పార్ట్ 2 పై కూడా అందరికీ మరింతగా అంచనాలు ఏర్పడడం జరిగింది.
ఇక అనుకున్న విధంగా నిన్న ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం 2 మూవీ ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి టాక్ సొంతం చేసుకుంటూ కొనసాగుతోంది. ఫస్ట్ పార్ట్ ని మించేలా దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ రెండవ పార్ట్ ని మరింత అద్భుతంగా తీశారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగానే ఉండగా సెకండ్ హాఫ్ మరింత రసవత్తరంగా ఉండడంతో చాలా మంది ఆడియన్స్ సినిమాని మెచ్చుకుంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో రాంబాబుగా వెంకటేష్ అద్భుత నటనతో పాటు ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయని అంటున్నారు విశ్లేషకులు.
అటు రివ్యూస్ కూడా ఈ సినిమాకి చాలా వరకు పాజిటివ్ గా రావడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ లో ఎంతో ఆనందం వెల్లివిరిస్తోంది. ఇక ఇటీవల వరుసగా మంచి సక్సెస్ లు కొడుతూ కొనసాగుతున్న వెంకీ ఖాతాలో ప్రస్తుతం విడుదలైన దృశ్యం 2 రూపంలో మరొక సూపర్ హిట్ చేరడంతో ఆయనకి హీరోగా మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఇక ప్రస్తుత వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేష్ చేస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎఫ్ 3 చిత్రీకరణ జరుపుకుంటూ ఉండగా దీనిని రానున్న ఫిబ్రవరి లో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: