టాలీవుడ్‌లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాలు ఇవే..!

frame టాలీవుడ్‌లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాలు ఇవే..!

VUYYURU SUBHASH
జేమ్స్ బాండ్ సినిమా అంటే వెంటనే మనకు హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి.. సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో జేమ్స్ బాండ్ హీరోగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.. హాలీవుడ్ మూవీ ని తలపించేలా తెలుగులో మొదటిసారి జేమ్స్ బాండ్ మూవీ చేసి ఆ కొత్తదనం తెలుగు ప్రేక్షకులకు చూపించారు.. గూడచారి వన్ వన్ సిక్స్ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా జయలలిత చేయగా మల్లికార్జున్ రావు దర్శకత్వం వహించారు..

1. గూడచారి 116:
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే పలు నేరాలకు సాక్ష్యాలుగా మిగిలిన ఫోటో లకోసం సీక్రెట్ ఏజెంట్  303ను .. ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హత్య చేయడంతో ఈ మిస్టరీని ఛేదించడానికి ఏజెంట్ 116 కి బాధ్యతలు అప్పగిస్తుంది సిఐడి.. ఆ మిస్టరీని ఏజెంట్ 116 ఎలా చేదించాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగు లో జేమ్స్ బాండ్ మూవీస్ కి కృష్ణ కేరాఫ్ అడ్రస్‌గా మిగిలిపోయాడు.

ఆ తర్వాత ఏజెంట్ గోపి, గూడచారి 117 వంటి పలు చిత్రాలలో కూడా సూపర్ స్టార్ కృష్ణ నటించి, ఇక ఈ సినిమాలకు ఆయన తప్ప మరొకరు లేరు అన్నట్టుగా మిగిలిపోయారు.

2. గూడచారి నెంబర్ వన్:
చిరంజీవి హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాధిక హీరోయిన్ గా నటించింది. 1983 లో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ ను అందుకుంది.

3. విశ్వరూపం:
అప్పటికే పలు రకాల జేమ్స్ బాండ్ తరహా సినిమాల్లో నటించినప్పటికీ 60 సంవత్సరాల వయసు లో కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలో తన నటనతో విశ్వరూపం ప్రదర్శించాడు.

4. గూడచారి:
ఇప్పుడున్న యంగ్ హీరోల్లో అడవి శేషు నటించిన గూడచారి చిత్రం 2020 లో విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

5. చాణక్య:
ఈ సినిమాలో గోపీచంద్ రా ఏజెంట్ గా మెప్పించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: