ఢీ స్టేజ్ పై గుంటూరు టాకీస్ సీన్.. రెచ్చిపోయిన రష్మీ, సుధీర్?

praveen
ప్రస్తుతం బుల్లితెరపై సుడిగాలి సుధీర్ రష్మీ జోడి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లో మొదలైన వీరి లవ్ ట్రాక్ ప్రస్తుతం బుల్లితెర మొత్తం పాకిపోయింది. ఈ ఇద్దరూ  ఎక్కడ కనిపించినా కూడా ఈ ఇద్దరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారి పోతారు అని చెప్పాలి. అంతలా తెలుగు ప్రేక్షకులు అందరిని ఆకర్షించిన ఈ జోడీ ప్రస్తుతం బుల్లితెర సూపర్ జోడి గా క్రేజ్ సంపాదించింది. ఇద్దరు ఎక్కడ కనిపించినా కూడా బుల్లితెర ప్రేక్షకులు అందరూ మురిసిపోతూ ఉంటారు. ఇక వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు అయితే అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అంటూ సుడిగాలి సుధీర్ రష్మీ  పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇద్దరి మధ్య తెర మీద చూపించే లవ్ ట్రాక్ చూసి ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు అని కోరుకోని బుల్లితెర ప్రేక్షకులు లేడు అని చెప్పాలి. ఇకపోతే సుడిగాలి సుదీర్ జంట ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో లో టీం లీడర్ లుగా చేస్తున్నారు. క్వీన్స్ టీం తరఫున రష్మీ.. కింగ్స్ టీం తరఫున సుడిగాలిసుధీర్ టీం లీడర్ గా ఉన్నారు. అయితే ఇటీవలే సుడిగాలి రష్మీ మధ్య ఏకంగా గుంటూరు టాకీస్ లోని ఒక సీన్ రిపీట్ అయ్యింది అని చెప్పాలి.

 ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమం క్వార్టర్ ఫైనల్స్ ముగించుకుని సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ సెమీ ఫైనల్స్ కి మంచు లక్ష్మితో పాటు హీరో సిద్దు కూడా స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సిద్దు తో కలిసి రష్మి గుంటూరు టాకీస్ సినిమా చేసింది  ఇక ఈ సినిమాలో రొమాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ను ఢీ షో లో ప్లే  చేయగా సుధీర్ షర్ట్ పట్టుకొని ఒక్కసారిగా దగ్గరికి లాగుతుంది రష్మీ.. దీంతో జడ్జీగా ఉన్న పూర్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది.ఇక ఆ తర్వాత రష్మీ సుధీర్ కి కన్ను కొడుతుంది. ఇలా ఈ జంట తెరపై గుంటూరు టాకీస్ సీన్ రిపీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: