అయ్యబాబోయ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయట కూడా గొడవ పడుతున్నారు?

praveen
బిగ్బాస్ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ చూపును ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై బిగ్బాస్ కార్యక్రమం ఒక సెన్సేషన్ సృష్టించింది అనే చెప్పాలి. తమకు తెలిసిన సెలబ్రిటీల గురించి తెలియని ఎన్నో సీక్రెట్స్ తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా బిగ్ బాస్ రియాలిటీ షో చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉండడం చేస్తూ ఉంటారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఉంటారు.

 ఇక కొన్ని కొన్ని సార్లు అయితే ఏకంగా కొట్టుకుంటారు ఏమో అన్నంతగా ఒకరిమీదకి ఒకరు వెళ్తూ ఉంటారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం చాలా కామన్. అయితే ఎంత గొడవ పడినప్పటికీ ఆ తర్వాత మళ్లీ కలిసిపోయి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అంతే కాకుండా ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ బయటికి వచ్చిన తర్వాత మాత్రం మంచి స్నేహితులుగా మారిపోతుంటారు అన్న విషయం తెలిసిందే. కేవలం గొడవలు పడటం ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం బిగ్ బాస్ హౌస్ వరకు మాత్రమే పరిమితం చేస్తారు.


 ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో మాత్రమే కాదు హౌస్ బయట కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న  స్టార్ట్ మ్యూజిక్ అనే కార్యక్రమంలో బిగ్ బాస్ ఐదో సీజన్లో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు గెస్ట్ లుగా వచ్చారు. ఒకవైపు టీమ్ లో  లోబో ఉండగా మరోవైపు టీం లో హామీద ఉంది. ఇక వీరిద్దరూ అచ్చం బిగ్ బాస్ హౌస్ లో గొడవ పడినట్లు గానే  ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ  రెచ్చిపోయారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో కాకుండా బయట కూడా  ఇలా పోట్లాడుకోవడం తో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: