హీరోగా కంటే విలన్ గా బాగా సంపాదిస్తున్న జగపతిబాబు...!

murali krishna
నేను హీరోనయ్యా  విలన్ గా చేయడం ఏమిటి  అని మడికట్టుకు కూర్చున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆర్ నారాయణ మూర్తిని చూస్తే అర్ధం అవుతుందని తెలుస్తుంది.
నిజానికి ఆర్ నారాయణ మూర్తికి మంచి క్యారెక్టర్స్ ఇవ్వడానికి చాలామంది టాప్ డైరెక్టర్స్ ప్రయత్నాలు చేశారట. కానీ నేను హీరోగానే చనిపోయేవరకు నటిస్తాను అంటూ నారాయణ మూర్తి వచ్చిన ఛాన్స్ లను కాదనుకున్నారట.
కానీ, ఒకప్పుడు సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ సినిమాల హీరోగా బాగా చలామణి అయిన జగపతి బాబు మాత్రం అలాంటివి ఏవి పెట్టుకోకుండా విలన్ గా మారిపోయాడని తెలుస్తుంది.నిజానికి జగపతి బాబు విలన్ గా మారడానికి ముందు వరకు ఆయనకు హీరోగా సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది.. కానీ, వరుసగా తన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి బాక్సాఫీస్ వద్ద దారుణంగా బకెట్ తన్నేస్తూ వచ్చాయని తెలుస్తుంది
ఇక ఒక్క హిట్ కూడా రాకపోవడంతో.. ఇక చేసేది ఏమి లేక మొత్తానికి హీరోగా సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాడట. అయినా, కొందరు కొత్త నిర్మాతలు మాత్రం చిన్నాచితకా ఎమౌంట్ పట్టుకుని సినిమాలు చేస్తాం అంటూ వచ్చేవాళ్ళట.అయితే, తన సినిమాల మార్కెట్ తనకు తెలుసు కాబట్టి జగపతి బాబునే స్వయంగా తనతో ఇక సినిమాలు తీయకండయ్యా అంటూ నిర్మాతలు చెప్పుకునేవాడని తెలుస్తుంది.
అలాంటి సమయంలో బోయపాటి శ్రీను వచ్చి విలన్ వేషం ఇచ్చాడట.బాలయ్య బాబు లెజండ్ లో విలన్ గా చేశాక జగపతి బాబు సుడి తిరిగిందని తెలుస్తుంది. పాతికేళ్ళు హీరోగా చేస్తే ఎంత సంపాదించానో అలాగే పదేళ్ళు విలన్ గా చేసి అంతకంటే ఎక్కువ సంపాదించానని చెప్పుకొచ్చాడటా . ఇంకా సంపాదించుకుంటున్నాను అంటూ జగపతి బాబునే స్వయంగా చెప్పాడని తెలుస్తుంది.అంటేనే విలన్ గా ఆయనకున్న డిమాండ్ ను అర్ధం చేసుకోవచ్చని తెలుస్తుంది.
ఇప్పుడు హీరో శ్రీకాంత్ కూడా విలన్ గానే మారుతున్నాడట.శ్రీకాంత్ పరిస్థితి కూడా సేమ్ జగపతి బాబుదే అని హీరోగా పెద్దగా సంపాదించింది ఏమి లేదని అయితే, ఇప్పుడు విలన్ గా బాగా సంపాదించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది మరి శ్రీకాంత్ ఆ అవకాశాన్ని ఎంతవరకు వాడుకుంటాడో చూడాలి మరి అలాగే హీరో రాజశేఖర్ కూడా త్వరలో విలన్ గా మారనున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: