వెనకడుగు వేసేది లేదంటున్న బంగార్రాజు ... ??
కాగా ఈ సినిమాని సోగ్గాడే సినిమా కంటే కూడా మరింతగా ఆకట్టుకునే రీతిలో మరింత భారీ వ్యయంతో కళ్యాణ్ కృష్ణ తీస్తుండగా దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తుండడం విశేషం అని అంటున్నారు. ఇక అది మాత్రమే కాక ఈ సినిమాలో కింగ్ నాగార్జున తో కలిసి తనయుడు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. అలానే ఇటీవల ఉప్పెనతో సూపర్ హిట్ కొట్టి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న యువ భామ కృతి శెట్టి నాగ చైతన్య కి జోడీగా ఈ సినిమాలో యాక్ట్ చేస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో కంపోజ్ చేయబడిన లడ్డుండ అనే పల్లవితో సాగె ఈ సినిమా లోని ఫస్ట్ సాంగ్ కొద్దిరోజుల క్రితం యూట్యూబ్ లో విడుదలై శ్రోతలను బాగా ఆకట్టుకుంది.
కాగా ఈ సినిమా ని వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 15న విడుదల చేయనుందట యూనిట్. మరోవైపు ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా బ్యాలన్స్ షూట్ ని కూడా వేగవంతంగా నిర్వహిస్తోందట యూనిట్. ఇక ముందుగా తాము భావిస్తున్న మాదిరిగా ఎట్టి పరిస్థితుల్లో బంగార్రాజు ని సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిపేందుకు యూనిట్ పక్కాగా సిద్ధం అవడంతో పాటు అధికారికంగా రిలీజ్ డేట్ పై అతి త్వరలో అనౌన్స్ మెంట్ చేయనున్నారట. మొత్తంగా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ బంగార్రాజు మూవీ రేపు రిలీజ్ తరువాత ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.