పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడేనా...?

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. అని ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని అందరికి తెలుసు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారట మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని తెలుస్తుంది.. దాంతో చిత్రం ప్రమోషన్ యాక్టివిటీస్ పెంచేశారని తెలుస్తుంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్, వీడియోలు, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలుస్తుంది.. ఈ నేపధ్యంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ రకరకాల ప్లేస్ లలో ప్లాన్ చేసారని తెలుస్తుంది.వాటితో సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ క్రమంలోనే దుబాయిలో నవంబర్ ఫస్ట్ వీక్ లో ఓ భారీ ఈవెంట్ ని జరపనున్నారని హిందీలోనూ ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో మరో భారీ చిత్రం `ఆర్ ఆర్ ఆర్` దారిలోనే వెళ్లి దుబాయిలో ఈవెంట్ చేస్తున్నారని సమాచారం.

అలాగే సినిమా ప్రారంభించినప్పటిన ఉండి మొన్నటి వరకు సినిమాను పాన్ ఇండియా లెవల్‌ లో మొత్తం అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటిస్తూ వచ్చారని కాని ఇటీవల హిందీ వర్షన్‌ ను స్కిప్‌ చేస్తున్నట్లుగా వార్తలు మొదలు అయ్యాయని హిందీని స్కిప్‌ చేసినట్లుగా యూనిట్‌ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇచ్చారట అయితే హిందీకు ఇబ్బందులు తొలిగినట్లు సమాచారం అందింది దాంతో హిందిలోనూ భారీగా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.

దాంతో ఉత్తరాది అభిమానులతో పాటు ఇక్కడి ఫ్యాన్స్ కూడా `పుష్ప` ను ఆదిరిస్తారని వీటి వల్ల రికార్డు బ్రేకింగ్ వసూళ్లు పుష్ప కు వస్తాయని అంటున్నారట.ఉత్తరాదిన బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని వారు అంతా కూడా `పుష్ప` హిందీ వర్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: