కోటి కొడుకు కోసం సాహసం చేస్తున్న చిరంజీవి..!!
ఈ సినిమాకి నిర్మాతగా వీరేష్ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా వర్ష విశ్వనాథ్ నటిస్తోంది. ఇంకా ముఖ్యమైన పాత్రలో రాజా రవీంద్ర, రాజశ్రీ మిగతా కొంతమంది ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు కూడా చాలా స్పీడ్ గా జరుపుతున్నారు అన్నట్లుగా సమాచారం. డిఫరెంట్ స్టోరీ గల ఈ సినిమాకు మెగాస్టార్ సపోర్ట్ చేయడం చాలా గమనార్హం.
ఈ సినిమా సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ఈ నెల 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులో విడుదల చేయబోతున్నట్లు గా ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు చిత్ర యూనిట్ సభ్యులు.
ఇక ఈ మూవీకి సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి ఇదే హైలెట్ గా నిలవనుంది. ఇక ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం ఒక గొప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాజీవ్ సాలూర్ పాత్ర ఈ సినిమాకి ప్లస్ గా ఉంటుందని నిర్మాత వీరేష్ తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నట్లుగా చిత్రయూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీగా మహేశ్వర్ పనిచేస్తున్నారు. ఇప్పటికే మాటలు మాత్రం పవన్ అందిస్తున్నాడు.