శ్యామ్ సింగ రాయ్ సినిమాను వదులుకున్న హీరో ఎవరో తెలుసా..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తన కష్టాన్ని నమ్ముకొని అంచెలు అంచెలుగా ఎదుగుతూ న్యూచురల్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. సహజమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టిన నాని, హీరోగా, ప్రొడ్యూసర్ గా రాణింస్తున్నారు. ఆయన ఓకే సంవత్సరంలో ఆరు సూపర్ హిట్ సినిమాలను చేసి తనకంటూ ఓ రేంజ్ సెట్ చేసుకున్నాడు.
తాజాగా నాని ట్యాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే రాహుల్ సంకృత్యన్ ఇండస్ట్రీకి ట్యాక్సీవాలా సినిమాతో పరిచయమైయ్యారు. ఈ సినిమా విజయ్ దేవరకొండ నటించిన సంగతి అందరికి తెల్సిందే.  ఇక ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టితో పాటుగా మళయాళ భామ మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాని డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ మధ్య కాలంలోనే విడుదల చేసిన శ్యామ్ సింగ రాయ్ టైటిల్ సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో కూడా అంచనాలు నెలకొన్నాయి.
అయితే దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాను రానాతో తీయాలని అనుకున్నారంట. ఈ సినిమా స్టోరీని రానాకీ చెప్పి చర్చలు జరిపినట్లు సమాచారం. ఏమైందో తెలియదు కానీ రానా ఈ సినిమను రిజెక్ట్ చేశారంట. రానా ఇదివరకు తను చేసిన సబ్జెక్ట్ లా అనిపించిందో లేక మరే కారణమో తెలియదు కాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను రానా వదులుకున్నారు. ఇక చివరికి ఈ సినిమా స్టోరీ నానికి చేరడం ఆయన ఓకే అనడంతో సినిమా పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: