ర‌జ‌నీ ' పెద్ద‌న్న ' టాక్ ఎలా ఉంది.. ప్చ్ పెద‌వి విరుపులేనా..!

VUYYURU SUBHASH
సౌత్ ఇండియ‌న్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఈ వ‌య‌స్సులో కూడా కుర్ర హీరోల‌కు పోటీ గా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న కెరీర్ లో విజ‌య వంతంగా 168 సినిమాల్లో న‌టించిన ర‌జ‌నీ ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నా .. వ‌య‌స్సు పై బ‌డినా కూడా సినిమాలు చేస్తూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఆయ‌న న‌టించిన సినిమా పెద్ద‌న్న‌. కోలీవుడ్ లో అన్నాత్తే పేరు తో తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగు లో సురేష్ బాబు పెద్ద‌న్న పేరుతో రిలీజ్ చేశారు. రు. 12. 5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ తెలుగులో పెద్ద‌న్న కు జ‌రిగింది.

వాస్త‌వంగా ర‌జ‌నీ కాంత్ కు తెలుగులో కూడా రు. 35 - 50 కోట్ల మార్కెట్ ఉండేది. అయితే వ‌రుస ప్లాపుల‌తో ఉండ‌డంతో ఆయ‌న మార్కెట్ క్ర‌మ క్ర‌మంగా ప‌డిపోతూ వ‌స్తోంది. ఇక ఈ రోజు రిలీజ్ అయిన పెద్ద‌న్న సినిమాకు సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఊర‌మాస్ చిత్రాల‌తో సౌత్ ఇండియా లో త‌న కంటూ స‌ప‌రేజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఒక‌ప్ప‌టి సినిమాటోగ్రాఫ‌ర్ శి వ - ర‌జనీకాంత్ కాంబినేష‌న్లో ఇదే తొలి సినిమా.

ఈ సినిమాలో కీర్తి సురేశ్ - లేడీ సూపర్ స్టార్ నయనతారతో , సీనియ‌ర్ హీరోయిన్లు మీనా , ఖుష్బూ కీలక పాత్రల‌లో నటించారు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా కు మిక్స్ డ్ టాక్ వ‌స్తోంది. ర‌జ‌నీ కాలా, క‌బాలీ లా నీర‌సంగా ఉంద‌నే కామెంట్లు ఎక్కువుగా విన‌ప‌డుతున్నాయి. ఎక్కువ మంది సోష‌ల్ మీడియాలో ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా వుందంటున్నారు.

ఇక సినిమాలో పాత చింత‌కాయ ప‌చ్చ‌డి కామెడీ.. ఓవర్ సెంటిమెంట్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయ‌ని అంటున్నారు. సినిమాలో ఏదైనా చెప్పుకోవాల్సింది ఉందంటే అది కేవ‌లం రజిని మార్క్ మాస్ సీన్స్ మాత్రమే హైలెట్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: