షారుక్ ఖాన్... బి టౌన్ లో బిగ్ బి గా గుర్తింపు పొందిన ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు ఎంత చెత్త సినిమా అయినా కూడా మంచి విజయాన్ని పొందుతుంది. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీ విషయానికొస్తే ఏ హీరో,హీరోయిన్స్ ప్రతి ఒక్కరికి ఒక ప్రేమ కథ ఉంటుంది అని తెలిసిందే. అలాగే ఈ హీరో ప్రేమకథ కూడా పెద్దదే అట. ఇక షారుక్ ఖాన్ తన భార్య అయిన గౌరీ ఖాన్ ను మొదట ప్రేమించి ఆ తరవాత పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే వీధి లవ్ స్టోరీ వెనుక ఒక పెద్ద కథ ఉందట వివరాల్లోకి వెళితే..
అసలు విషయం ఏంటంటే వీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే ఫ్రెండ్స్ అట. షారుఖాన్ ఇండస్ట్రీలో ఎదిగాక గౌరీ ఖాన్ కి ప్రపోజ్ చేస్తే మొదట వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. అసలు తను నటుడు కావడమే తన అనర్హత అని తండ్రి చెప్పగా తల్లి ఏమో షారుక్ ఖాన్ ని ససేమిరా వద్దని ఒప్పుకోలేదట. గౌరీఖాన్ ఆయన సోదరుడు ఏకంగా షారుఖాన్ తలకి గన్ గురిపెట్టి తన సోదరిని వేయకపోతే చంపేస్తానని బెదిరించడు. మరి మన హీరో మాత్రం దేనికి భయపడకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అని గట్టిగా నిర్ణయించుకున్నాడట. అంతే కాదు గౌరీఖాన్ తల్లి వీరిద్దరు విడిపోవడానికి ఎంతోమంది జ్యోతిష్కులకి కలవడం కూడా జరిగిందట.
ఎన్ని చేసినా వీరిద్దరి ప్రేమ మాత్రం సక్సెస్ అయింది. ఇక షారుక్, గౌరీ ఖాన్ అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఈరోజు షారుక్ ఖాన్ గురించి తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పుకోవడానికి గల కారణం నేడు ఆయన పుట్టినరోజు కనుక. హ్యాపీ బర్త్ డే షారుక్ ఖాన్.. ఇక షారుఖాన్ సినిమా విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది ఇక ఈ సినిమాకి 'లయన్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్ గా కనిపించబోతోంది...!!