బాలకృష్ణ కోసం వెనకడుగు వేస్తున్న నాని !
అయితే ఇప్పుడు ఈ ఊహలకు బాలకృష్ణ రూపంలో అడ్డు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన ‘అఖండ’ డిసెంబర్ 24న విడుదల చేయడానికి ఒక నిర్ణయం తీసుకుని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలచేయాలి అన్న ఆలోచనలో అడుగులు పడుతున్నట్లు టాక్.
ఇప్పుడు ఈవిషయాలు నాని దృష్టి వరకు వెళ్ళడంతో ‘టక్ జగదీష్’ నిర్మాతలతో నాని ప్రస్తుతం చర్చలు జరుపుతూ తన మూవీని బాలయ్య మూవీతో పోటీగా విడుదల చేయాలా లేదంటే తన మూవీ రిలీజ్ డేట్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవాలా అన్న ఆలోచనలలో ప్రస్తుతం నాని టెన్షన్ పడుతున్నట్లు టాక్. ‘అఖండ’ పై భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈమూవీకి చాలామంచి ఓపెనింగ్ కలక్షన్స్ వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్నఅభిప్రాయం నానికి ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికితోడు తన మూవీ కథ కొంతవరకు డిఫరెంట్ గా ఉండే పరిస్థితులలో తన మూవీని ఒక మాస్ మూవీతో పోటీగా విడుదల చేయడం కంటే ఫిబ్రవరి మొదటి వారంలో కాని లేదంటే మార్చి నెలలో కాని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న అభిప్రాయం నానిలో ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాని కెరియర్ కొంతవరకు ఒడుదుడుకులు లోనవుతున్న పరిస్థితులలో మరొకసారి ప్రయోగం చేసి పరాజయం తెచ్చుకునే కంటే ఒక మంచి రిలీజ్ డేట్ ను తన మూవీకి ఎంచుకోవడం మంచిది అన్న ఉద్దేశ్యం నానికి ఉంది అని అంటున్నారు..