తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు స్ట్రగుల్ టైం లో ఉన్నప్పుడు సరైన హిట్ ఇచ్చి వారికి మంచి ఫ్యూచర్ ఇచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్.. కానీ తన కొడుకుకు మాత్రం అలాంటి హిట్ ఇవ్వలేక పోతున్నారు.. అంతేకాదు తన తమ్ముడు సాయిరాం శంకర్ తో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా అలాగే చేయించినా ఒకటికి ఒకటి కూడా సరైన విజయం లేదు.. కనీసం తన కొడుకు తో నైనా మంచి విజయాన్ని పొందాలి అనే ప్రయత్నాలను బాగా చేస్తున్నాడు.. ఇకపోతే తాజాగా రొమాంటిక్ అనే సినిమాతో నైనా హిట్ కొడతాడు అని భావిస్తున్నాడు పూరి జగన్నాథ్.
ఈ సినిమా ఎలా ఉంటుందో అనే విషయం గురించి పక్కన పెడితే , ఈ సినిమాలో హీరోగా నటించిన ఆకాశ్ ఆలోచనలు మాత్రం తారా స్థాయిని అందుకుంటున్నాయి. అంతేకాదు ఆకాష్ ఆలోచనలు రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ని కూడా మెప్పించాయి అంటే అతిశయోక్తి కాదు.. ఆకాష్ ఆలోచనల గురించి కొన్ని రోజుల క్రితం పూరిజగన్నాథ్ మాట్లాడుతూ.. మా ఇంటికి వచ్చే హీరోలను అలాగే నిర్మాతలను కూడా ఆకాష్ బాగా కాక పడుతుంటాడు.. అవకాశాల కోసం తన ప్రయత్నం తాను బాగా చేస్తుంటాడు అని చెప్పాడు.. ఆకాష్ హీరో అయ్యాడే తప్ప సరైన సినిమా ఒక్కటి కూడా రావడం లేదు.. నాకే పోటీ వస్తా అంటున్నాడు.. అంతేకాదు నాకే రెమ్యునరేషన్ ఇచ్చి నా కథ తీసుకుంటాడట.. ఆకాష్ నా కొడుకు కావటం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ తెలిపాడు పూరి జగన్నాథ్..
ఇకపోతే పూరి జగన్నాథ్ తన దర్శకత్వంలో తన కొడుకుకు ఎందుకు సరైన కథ రాయడం లేదు.. లేక ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని కొంతమంది అనుకుంటుంటే, ఆకాష్ మాత్రం ఇతర దర్శకులతో సరైన హిట్ కొట్టాక , నాన్నతోనే ఒక సినిమా చేస్తాను.. అంతే కాదు డబ్బులు ఇచ్చి మరి ఆయనతో కథ కొంటాను.. అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు..