50 రోజుల్లో 5 మల్టీస్టారర్లు.. ఇక ఆడియన్స్ కి పండగే..!!

Anilkumar
ప్రస్తుతం మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల హవా కొనసాగుతోంది. యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మల్టీస్టారర్ సినిమాలకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో.. అది కూడా కేవలం 50 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 బడా మల్టీస్టారర్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ మల్టీస్టారర్ సినిమాల ను ఒక సారి పరిశీలిస్తే.. వచ్చే ఏడాది మొదట్లో అంటే జనవరి 7వ తేదీన రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నా 'ఆర్ఆర్ ఆర్' ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో మెగా నందమూరి హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత అదే నెలలో జనవరి 12న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రాణా ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ 'భీమ్లా నాయక్' సినిమా  రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.

 ఇక అదే నెలలో జనవరి 15న నాగార్జున,నాగచైతన్యల 'బంగార్రాజు' సినిమా కూడా విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా సంక్రాంతి బరిలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ల 'ఆచార్య' సినిమా ఫిబ్రవరి 4న విడుదల కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అదే నెలలో అంటే ఫిబ్రవరి 25న వెంకటేష్, వరుణ్ తేజ్ 'ఎఫ్3' మూవీ రిలీజ్ కానుంది. ఇలా మొత్తంగా కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 మల్టీస్టారర్ సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులకు ఊహించని రీతిలో ఎంటర్టైన్మెంట్ అందబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: