సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న పూరీ కూతురు...ఆకాష్ పూరీ క్లారిటీ..!

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలోకి నటీనటుల వారసుల ఎంట్రీ సాధారణ విషయమే. అయితే ఇప్పుడు నిర్మాతలు దర్శకుల కూతుర్లు కొడుకులు కూడా ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే పలువురు నిర్మాతల దర్శకుల వారసులు టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆకాష్ పూరి కి సరైన హిట్ లేకపోయినా ఇండస్ట్రీ లో నిలబడే ప్రయత్నం చేస్తూ ఒక్కో సినిమా విడుదల చేస్తూ వెళుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆకాష్ పూరి రొమాంటిక్ అనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరుకాగా ఈవెంట్ లో ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కాలర్ ఎగరేసుకునే సినిమా తీసి తీరుతాం అంటూ కామెంట్ చేసి వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆకాష్ పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి పవిత్ర పూరీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవిత్ర పూరి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అంటూ ప్రశ్నించగా.... పవిత్రకు నటనపై ఇంట్రెస్ట్ లేదని ఆకాశ్ స్పష్టంచేశారు. తనతోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందని అయితే అప్పుడు కూడా తనకు ఇష్టం లేదని సరదాగా నాన్నే పట్టుబట్టి చేయించారని చెప్పాడు. పవిత్ర యాక్టింగ్ వైపు వచ్చే అవకాశం లేదని స్పష్టంచేశాడు. మొదటి నుంచి ప్రొడక్షన్ వైపు ఆసక్తి ఎక్కువగా ఉందని అన్నాడు.. అందువల్ల భవిష్యత్ లో ఆమె సినిమా నిర్మాణాల వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉంది అని ఆకాష్ క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: