రికార్డు ధరకు 'రాధేశ్యామ్' డిస్ట్రిబ్యూషన్ రైట్స్
ఇక ఇప్పటికే సినిమా టాకీ పార్ట్‌ను కూడ పూర్తి చేసుకుంది. దీంతో ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఆర్డి ఇల్యూమినేషన్ భారీ ధరకు సొంతం చేసుకున్నది . అయితే ఎంత ధరకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడు అయ్యాయనే విషయంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. కానీ కరోనా తరువాత మాత్రం అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడైన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాత్రం “రాధేశ్యామ్” దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విశేషం.
మరోవైపు మరో టీజర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ‘రాధే శ్యామ్’ మేకర్స్ నుంచి రెండవ టీజర్ గా హీరోయిన్ కు సంబంధించిన వీడియో రాబోతోంది. దీపావళి పండుగ రోజున ఈ ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్. పోస్టర్ నుంచి పూజా హెగ్డే లుక్స్ ఇప్పటికే మంచి హైప్ ఉంది. ఈ సినిమా ప్రభాస్ విక్రమాదిత్య అనే పామిస్ట్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. తన ప్రేయసి ప్రేరణ జాతకం విక్రమాదిత్యకు తెలుస్తుందని.. దీనిని ఆధారం చేసుకొని కథ అల్లుకున్నారని టాక్ వినిపిస్తోంది. థ్రిల్లర్ అంశాలతో కూడిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తున్నాడని మరో టాక్. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తూ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇప్పటికే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేసిన విషయం విధితమే. ఇక ప్రేరణ పాత్ర పోసిస్తున్న పూజాహెగ్డేకు సంబంధించిన టీజర్‌ను అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిటి సన్నాహలు సిద్ధం చేస్తోంది. దీనిని దీవాళి సందర్భంగా విడుదల చేయనున్నారు. మొత్తానికి 'రాధేశ్యామ్' సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది.