జైల్లో ఆ పని చేస్తున్న ఆర్యన్ ఖాన్.. అసలు విషయం తెలిస్తే షాక్..!!

Divya
బాలీవుడ్ బాద్ షా షారుఖాన్ ముద్దుల తనయుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో అనూహ్యంగా ఎన్ సి బి అధికారుల చేతికి చిక్కి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇతడిని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచారు.. ఇకపోతే ఆర్యన్ ఖాన్ ను జైలు నుంచి బెయిల్ మీద తీసుకురావాలని ఆర్యన్ ఖాన్ తండ్రి షారుక్ ఖాన్ సర్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ముంబై కోర్టు మాత్రం వీరికి అనుకూలంగా లేనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే షారుఖ్ ఖాన్ తన సొంత లాయర్ ద్వారా ఐదు సార్లు బెయిల్ మంజూరు చేయమని రిక్వెస్ట్ చేసినా ముంబై కోర్టు మాత్రం వీరి బెయిల్ నిరాకరిస్తూ వస్తోంది..
అయితే ఈ మధ్య షారుక్ ఖాన్ తన కొడుకును కలవడానికి జైలుకు వెళ్లినప్పుడు, అక్కడ ఆర్యన్ ఖాన్ మాత్రం జైల్లో భోజనం బాగా లేదు అంటూ బోరున విలపించాడు.. ఇక తండ్రి  గుండె తరుక్కు పోయి బాధకు గురి అవుతున్న సమయంలో మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వీరికి అండగా నిలిచారు.. ఇక సల్మాన్ ఖాన్ కూడా గతంలో అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద బయటకు తెప్పించిన తన లాయర్ ను రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ చేస్తున్న పనికి ప్రతి ఒక్కరూ షాక్ కి గురి అవుతున్నారు.

ఆర్యన్ ఖాన్ తనకు కావలసిన పుస్తకాలను జైలు యొక్క లైబ్రరీ నుంచి తెప్పించుకొని మరీ చదువుతున్నాడు.. రెండు రోజుల నుంచి రాముడు, సీతా దేవి పుస్తకాలను ఎక్కువగా చదువుతున్నట్లు సమాచారం.. ఆర్యన్ ఖాన్ జ్యుడిషియల్ కస్టడీని ఈనెల 30వ తేదీ వరకు ముంబై స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సేస్ కోర్టు మరోసారి పొడిగించినట్లు సమాచారం.. సత్ప్రవర్తనతో ప్రవర్తించాలని, జైలులో ఉన్న పుస్తకాలను చదవాల్సింది గా అధికారులు సూచించారట. అంతేకాదు లైబ్రరీ నుంచి పుస్తకాలు కూడా అందించారు.. ఇక దీనికి ముందే ఆర్యన్ ఖాన్ ది లయన్స్ గేట్ అనే పుస్తకాన్ని కూడా తెప్పించుకొని చదివినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: