కమలహాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి రహస్యాలు ఇవేనట..?

Divya
విశ్వనటుడు కమలహాసన్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా మరుద నాయగం. ఈ సినిమా ని 1997లో ప్రారంభించారు. అప్పట్లోనే ఈ సినిమా గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనే చర్చలు జరిగాయట. ఈ సినిమాకి కమల్ హాసన్ నే డైరెక్టర్, నిర్మాతగా మొదలుపెట్టారట. ఇ సినిమా స్టోరీ కూడా కమల్ హాసన్ రాశారట. అప్పట్లోనే ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం. దేశంలోనే మొదటిసారిగా భారీ బడ్జెట్ సినిమాని రికార్డుకెక్కింది ఇది.

అయితే ఎంతో అట్టహాసంగా మొదలైన ఈ సినిమా ప్రాజెక్ట్.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ ఈ సినిమా ప్రాజెక్టు పై స్పందించినా ఫలితం లేకుండా పోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎన్నో సంవత్సరాల నుండి బిగ్ బాస్ షో లో యాంకర్ గా ఉంటున్నాడు కమలహాసన్. ఇక ఈ షోలో మరదనాయగం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు బయటపెట్టారు.
తమిళనాడులోని "తమిళర్ నాటు పడల్ గల్" అనే ఒక పుస్తకం గురించి కూడా తెలియజేశాడు. పుస్తకంలో లోని పాటలు చదివి, నేను తెలుసుకున్నవి చాలానే ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ఈ బుక్కు లో ఉన్నటువంటి "మరుదనాయగం." ఇందులో నుంచి పుట్టిన పాత్రనే  నేను చేయాలనుకున్నాను అని చెప్పుకొచ్చాడు.ఇది 1800 శతాబ్దంలోని ఒక యోధుడు కథ అని తెలియజేశాడు.
అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ లో ఆర్మీ కమాండర్ గా ఉన్న వ్యక్తి మొహమ్మద్ యూసఫ్ ఖాన్ గా మారాడు. ఆ తరువాత భారతదేశం కోసం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఈ కథ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని మొదలు పెట్టాను. కానీ అది కుదరలేదు. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో దివంగనటుడు "అమ్రిష్ పూరి"చేయవలసి ఉంది. ఈ నటుడే కాకుండా ఇందులో విష్ణువర్ధన్, నాజర్ మరికొంతమంది నటులను తీసుకున్నారట. కానీ ఈ సినిమా పూర్తికాకుండానే హిస్టరీలో మిగిలిపోయిందని కమలహాసన్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: