ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను మార్చిన భక్త కన్నప్ప..?

Divya
చిలకా గోరింక సినిమాతో సినీ ఇండస్ట్రీకి లోకి రంగప్రవేశం చేశాడు కృష్ణంరాజు . గోపికృష్ణ బ్యానర్ పై తీసిన రెండవ సినిమా భక్త కన్నప్ప. ఇక ఈ సినిమా కృష్ణంరాజు చేయడం అంటే చాలా ఇష్టం ఉండడంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. కన్నప్ప కథాంశంతో నే 1954 వ సంవత్సరంలో కన్నడంలో"బేడార కన్నప్పగా , తెలుగులో కాళహస్తి మహత్యం, ఒక చిత్రం రూపొందించింది.
ఇక కన్నడలో రాజ్ కుమార్ తొలి చిత్రంగా, పాతాళభైరవి హీరోయిన్ మాలతి తదితరులతో కలిసి HLNనరసింహ తెరకెక్కించారు. ఈ కథాంశం తో నే తిరిగి మళ్లీ భక్త కన్నప్ప అనే సినిమాను మొదలు పెట్టారు. వి.మధుసూధనరావు దర్శకత్వంలో సినిమాకి అన్ని ఏర్పాట్లు జరిగాయి. కృష్ణంరాజు సోదరుడు వెళ్లి ముల్లపూడి ని పెళ్లి కలవగా ఈ సినిమా గురించి తెలియజేసి కథలోని కొన్ని మార్పులు చేయడం జరిగింది.
కాల హస్తి మహత్యం లో లేని. కిరాత అర్జున యుద్ధం అనే ఎపిసోడ్ ని భక్తకన్నప్ప సినిమా లో అద్భుతంగా ఉపయోగించుకున్నారు రమణ. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కైలాసం ఎపిసోడ్ తప్ప మిగతా అంతా పట్టిసీమ, గూటాల, గుట్టాయిగూడెం వంటి పరిసర ప్రాంతాలలో తీశారు. ఇక ఈ సినిమా షూటింగ్ లో సిద్దు వేయడానికే 45 రోజుల సమయం పట్టిందట. ఇక ఈ సినిమాలోని అవసరాల కోసం గుట్టాయిగూడెం నుంచి వారి షూటింగ్ స్థలానికి పది కిలోమీటర్ల వరకు రోడ్డు చెప్పినట్లు సమాచారం.
ఇక ఈ సినిమా సెట్స్ కోసం వేసిన ఖర్చు మొత్తం తొమ్మిది లక్షలు రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి మొత్తం ఖర్చు 20 లక్షల రూపాయల వరకు అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం అక్కడ జరుగుతూ ఉండడంతో మొత్తం సినీ సభ్యులంతా అక్కడే ఉండే వారు ఈ సినిమా షూటింగ్ సంబంధించిన వారు. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే సాయంత్రం వేళ వినోద కార్యక్రమాలు కూడా చేసుకునే వారట.
ఇక ఈ సినిమాలో ఒక పాత్ర కోసం రాజబాబు ను తీసుకోగా ఆయన డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆయన ఈ సినిమాల లో నటించ లేకపోయాడు. ఇక దాంతో ఈ సినిమా షూటింగ్ అయిపోతుంది అనుకుంటే.. అప్పటికప్పుడు నటుడు పద్మనాభం తో మాట్లాడి ఈ సినిమా షూటింగు వస్తుండగా మార్గమధ్యంలో తన తండ్రి చనిపోయాడన్న వార్త వినడంతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత సారధి అనే నటుడు ఈ సినిమా పాత్రలో నటించాడు. ఇక ఈయన నటించిన ఈ పాత్ర కోసం కల నటుడు అవార్డు కూడా సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో కష్ట పడిన ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ ఇచ్చిన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణంరాజు నటన అద్భుతంగా చేశాడు.. అందుచేతనే ఈయనకు భక్తకన్నప్ప అనే పేరు పడింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: