తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే 6 వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.. ఇక ఆరో వారంలో ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుండి శ్వేతా వర్మ ఎలిమినేట్ అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి వారం ఇలాగే ఎపిసోడ్ ప్రసారానికి ముందే శనివారం సాయంత్రం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది లీక్ అవుతుంది. అలా లీక్ జరిగినట్టుగానే కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు. ఈ లీకులకు చెక్ పెట్టాలని కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ముందుగానే లీకులు అవుతుండటం కూడా రేటింగ్ పై ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ ప్రతి సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ముందే హౌజ్ లోకి వచ్చి అప్పటి వరకు పోరాడిన వారికి లాభం ఏమీ లేదు అని చెప్పాలి. కానీ ప్రతి సీజన్లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పకుండా కనిపిస్తుంది...అయితే అలా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన సభ్యులు మాత్రం ఇప్పటివరకు గెలిచినట్టు తెలుగులో కనిపించలేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వర్షిని లేదంటే మరో యాంకర్ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ ప్రచారం జరిగింది.
అయితే ఆ వార్తలకు అక్కడితోనే చెక్ పడింది. ఇక ఇప్పుడు తాజాగా మరో సోషల్ మీడియా స్టార్ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తోంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ మీడియా స్టార్ ఎవరో కాదు... ప్రీతి అన్షు. ప్రీతి అన్షు అనేక షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తెలుగులో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడిని ఎంట్రీ ఇచ్చేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేసారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలు కూడా బిగ్ బాస్ పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పట్లో ఉండబోదని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ప్రీతి అన్షు తన వైల్డ్ కార్డు ఎంట్రీ పై స్పందించాల్సిందే .