కాళీ మాతతో హీరో నాని.. శ్యామ్ సింగరాయ్ లుక్ అదుర్స్..!
శ్యామ్ సింగరాయ్ లో నాని.. వాసు పాత్రలో కనిపించనున్నాడు. బెంగాలీ కుర్రాడిలా ప్రేక్షకులను అలరించనున్నాడు. ఎప్పుడూ కనిపించని లుక్ లో నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కు సరికొత్త అనుభూతిని మిగల్చనున్నాడు. గుబురు గడ్డం, అట్రాక్టిక్ హెయిర్ స్టైల్ తో ప్రేక్షకులకు కనిపించనున్నాడు. శ్యామ్ సింగరాయ్ పోస్టర్ లో.. అతని ప్రేమ, అతని వారసత్వం, అతని మాట అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్యామ్ సింగరాయ్ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్టు సమాచారం. శ్యామ్ సింగరాయ్ చిత్రానికి సత్యదేవ్ జంగా స్టోరీని అందించాడు. కెమెరామెన్ గా జాన్ వర్గీస్ పనిచేస్తున్నాడు. ఎడిటర్ గా నవీన్ నూలి కీలక బాధ్యత వహిస్తున్నారు.
శ్యామ్ సింగరాయ్ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక విడుదల కావడమే ఆలస్యం. హీరో నాని ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో ఇదే ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం కావడం విశేషం. అయితే ఇప్పుడు దసరాను పురస్కరించుకొని విడుదలైన.. కాళీ మాత సెట్టింగ్ గురించే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళీ మాత సెట్టింగ్ కోసం దాదాపు 6.5కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఇంకో విషయంలో ఏంటంటే దాదాపు 1200మంది కార్మికులు రెండు నెలల పాటు కష్టపడినట్టు సమాచారం. ఈ కాళీమాత సెట్టింగ్ కోసం బెంగాల్ కు సంబంధించిన కార్మికులు పనిచేసినట్టు సమాచారం.