సిద్ధార్థ్.. మహాసముద్రం మూవీ చేయడానికి అసలు కారణం ఇదేనట..?

Divya
ఆర్ ఎక్స్ 100 సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. అయితే ఇప్పుడు తాజాగా మరో ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోలుగా శర్వానంద్ సిద్ధార్థ లు నటిస్తున్నారు. ఆ సినిమా పేరే మహా సముద్రం. ఈ సినిమాలో రొమాంటిక్ తో పాటు ఒక డిఫరెంట్ కథతో కూడా ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాను ఎక్కువగా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లోనే తీసినట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ట్లుగా తెలుస్తోంది. ఇక హీరో సిద్ధార్థ్ నాలుగు సంవత్సరాల క్రితమే ప్రేక్షకులకు ఒక  అనౌన్స్మెంట్ తెలియజేశాను.. తిరిగి మళ్లీ తెలుగు సినిమాతో వచ్చి అలరిస్తారు అని చెప్పానని తెలియజేశాడు. ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
కానీ సరైన పాత్ర దొరకకపోవడంతో అన్ని సంవత్సరాలు పట్టింది.. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాను ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మరొకసారి నా నటన నచ్చుతుందని ఈ సినిమాలో నటించానని తెలియజేశాడు హీరో సిద్ధార్థ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా రి లాంచ్ కావాలని వెతుకుతున్నప్పుడు.. ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్.. తన దగ్గరకు వచ్చి ఒక కథ చెప్పాడని ఆ కథ వినగానే నాకు తెగ నచ్చడంతో తాను ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నాని హీరో సిద్ధార్థ్ తెలియజేశారు.
నన్ను హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ ఈయనే అని నమ్మకం మీదే ఈ సినిమాని ఒప్పుకున్నా అన్నట్లుగా హీరో సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. తను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే.. ఇది ఒక హీరో సినిమా కాదు.. ఒక వ్యక్తికి జరిగే నిజజీవితంలో ఉండే కథలాగా అనిపించడంతో ఒప్పుకున్నానని తెలియజేశాడు. తెలుగు ప్రేక్షకుల ముందు నన్ను ఒక హీరోగా గుర్తించడానికి సరైన అవకాశం వచ్చింది అని ఆయన తెలియజేశాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యాక తనకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు హీరో సిద్ధార్థ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: