
మా ఎన్నికల్లో ఓటేసిన చిరంజీవి... గొడవలపై కామెంట్..
మొత్తం ఒక్కో వ్యక్తి 26 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీ వితో పాటు యువరత్న నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఓట్లేశారు. ఇక మా ఎన్నికలలలో ముందు నుంచి మెగా స్టార్ తో పాటు ఆయన ఫ్యామిలీ అంతా ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మా ఎన్నికల నేపథ్యంలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నా ఇప్పటి వరకు ఎవ్వరూ దీనిపై స్పందించ లేదు.
ఇక మా ఎన్నికల లో ఓటేసేందుకు వచ్చిన చిరంజీవి ఈ రోజు ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజా స్వామ్య పద్ధతిలోనే మా ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మా ఎన్నికలు చాలా వాడీ వేడీ గా జరుగుతున్నాయని కూడా చెప్పారు. మా లో ప్రస్తుత పరిణామాలు చాలా దుర దృష్టకరమని చిరంజీవి చెప్పారు. మా ఎన్నికలు ఇంత వరకు రావడం ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదని కూడా చిరు తెలిపారు.
ఇక మా ఎన్నికల్లో ఎవరు ప్రజల మెప్పుతో గెలిచినా కూడా వారికే నా సపోర్ట్ అంటూ చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏదేమైనా మా ఎన్నికలు ప్రస్తుతం జరుగుతోన్న తీరు చూస్తుంటే ఇండస్ట్రీ వాళ్లే కాకుండా తెలుగు సినిమా ప్రేక్ష కులు కూడా షాక్ అవుతున్నారు. సినిమా వాళ్లు వాళ్ల లో వాళ్లే ఇలా దెబ్బ లాటలకు దిగుతుంటే వారి పట్ల జనాల్లో ఉన్న క్రేజ్ తగ్గడంతో పాటు మరింత చులకన అవుతోన్న పరిస్థితి.