మనోళ్లకు దేశ భక్తి ఎక్కువే అని ఇప్పుడు అర్థమైంది..!

NAGARJUNA NAKKA
'ఉరి' విడుదల అయ్యేవరకు విక్కీ కౌశల్‌ గురించి బాలీవుడ్ ఆడియన్స్‌కి కూడా పెద్దగా తెలియదు. కానీ  సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో విక్కీ కెరీరే మారిపోయింది. నేషనల్‌ అవార్డ్‌తో పాటు, నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ కూడా వచ్చింది. ఈ ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి దేశభక్తి కథల్లోనే నటిస్తున్నాడు విక్కీ కౌశల్. జలియన్‌ వాలా బాగ్ నరమేథానికి కారకుడైన జనరల్‌ డయ్యర్‌ని చంపిన ఉద్ధమ్‌ సింగ్‌ కథాంశంతో ఒక సినిమా చేస్తున్నాడు విక్కీ కౌశల్. సర్దార్‌ ఉద్దమ్ టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. అలాగే 1971 ఇండో-పాక్ వార్‌లో ఆర్మీ స్టాఫ్‌కి చీఫ్‌గా వ్యవహరించిన 'శామ్‌ మనేక్షా' లైఫ్‌స్టోరీతో 'శామ్‌ బహదూర్' అనే సినిమా చేస్తున్నాడు.
కార్తీక్‌ ఆర్యన్ ఇప్పటివరకు యాక్షన్‌ జానర్‌లో అడుగుపెట్టలేదు. 'పతి పత్నీ ఔర్ ఓ, లవ్‌ ఆజ్‌కల్' అంటూ అమ్మాయిలు, పువ్వుల చుట్టూనే తిరిగాడు. అయితే ఈ కథలు బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో పేటియాట్రిక్‌ స్టోరీస్‌లోకి వచ్చాడు కార్తీక్. రియల్‌ ఇన్సిడెంట్‌ ఆధారంగా 'కెప్టెన్ ఇండియా' అనే సినిమా చేస్తున్నాడు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న పైలెట్‌ కథాంశంతో తెరకెక్కుతోంది సినిమా. హీరోలు ఎన్ని చెప్పినా, మేకర్స్‌ ఎన్ని స్టేట్మెంట్స్‌ ఇచ్చినా ఫైనల్‌గా కావాల్సింది సూపర్‌హిట్లు, కలెక్షన్లు. ఆ వసూళ్ల కథలు ఎక్కడుంటే, మేకర్స్ అక్కడ వాలిపోతుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో దేశభక్తి కథలకి భారీ వసూళ్లు వస్తున్నాయి. బోనస్‌గా ప్రశంసలు కూడా తీసుకొస్తున్నాయి. అందుకే వెండితెరపై ఈ కథలకి డిమాండ్ పెరుగుతోంది.
మాస్ మూవీస్‌ ట్రై చేసినా, మాస్‌ హీరో కాలేకపోతోన్న వరుణ్ ధావన్, మాసివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడానికి ఇండో-పాక్‌ వార్‌ బ్యాక్‌డ్రాప్‌లోకి వెళ్లిపోతున్నాడు. 1971 ఇండో-పాక్ వార్‌లో బసంతర్‌ ఘటనలో అమరుడైన అరుణ్ కేధార్‌పాల్‌ కథాంశంతో 'ఇక్కీస్' అనే సినిమా చేస్తున్నాడు.
సిద్ధార్థ్‌ మల్హోత్రాకి బాలీవుడ్‌లో లవర్‌బాయ్‌ ఇమేజ్ ఉంది. అయితే ఈ మధ్య ఎన్ని లవ్‌ స్టోరీస్‌ చేసినా సిద్ధార్థ్‌కి సరైన హిట్ రావడంలేదు. దీంతో వార్‌ డ్రామాలోకి వెళ్లిపోయాడు. కార్గిల్‌ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా కథాంశంతో 'షేర్‌షా' అనే సినిమా చేశాడు. డైరెక్ట్‌ ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి క్రేజీ రెస్పాన్స్‌ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: