మార్నింగ్ రాగా : కొండపొలం చూశాను బాగుంది
గొర్రెల కాపరుల జీవితాలు.. జీవాలను రక్షించేందుకు చేసిన తపన..లేదా కృషి.. అక్కడి నుంచి పుట్టిన ఆచారం, పుట్టిన సంస్కృతి నా ఇంటి అరుగు దగ్గర నేర్చుకున్నాను..విన్నాను..విన్నవి చూసినవి ఇంకొంత బాగా రాయాలని కూడా అనుకున్నాను అంటారు సన్నపురెడ్డి. పుస్తక రూపంలో దక్కిన గౌరవం.. సినిమా రూపంలో ఆయనకు దక్కదు. ఆయనకే కాదు ఆ డైరెక్టర్ కు కూడా దక్క దు. అందుకు చాలా అవరోధాలు ఉన్నాయి. మంచి పాటలు కొన్ని వినిపించి ఉంటే ఆనందించేవాణ్ని.. నరకం చూశాను.. స్వరాలు వింటున్న ప్రతిసారీ.. అలా కాకుండా ఉంటే బాగుంటుంది కదా?
డైలాగ్ ను నేను బాగానే ఆశించాను. కొన్ని మాటలు బాగున్నాయి. ఇంకొంత బాగుంటే ఎంతో ఆనందించేవాణ్ని. ఓబులమ్మను బాగానే మేనేజ్ చేశారు. ప్రేమ కథలో నిజాయితీ బాగుంది. సినిమాటిక్ వాసనలు ఎందుకని ఈ కథకు అని అనుకోకూడదు. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి కథను వెలుగులోకి తెచ్చేందుకు చాలా ప్రయత్నించారు. ఆ విధంగా ఈ అడవి కథ కొంత నచ్చింది ..కొంత నచ్చలేదు.. మిశ్రమ స్పందనకు సంకేతిక..
నేల నుంచి నింగి వరకూ విస్తారం అయిన జీవితం ఒకటి మనలో ఉంటుంది. జీవితాన్ని మరిన్ని సవాళ్లతో నింపిన కాలాలూ ఉం టాయి. మనం ఏం సాధించినా, సాధించకున్నా నేల లక్షణాలకు అనుగుణంగా మనుషులను అర్థం చేసుకోవడం ఒక్కటి తప్పక నే ర్చుకోవాలి. ప్రతి చోటా సినిమా అనే ఓ పెద్ద మాధ్యమం సాధారణ కథలను ఒంటికి పూసుకుని తిరగడం జరగని పని. హీరో షర్టు నలగకుండా ఏ పనైనా చేయొచ్చు. కానీ ఈ సినిమా వాటికి భిన్నంగా పోయింది. సీమ నేలల్లో బాగా పేరున్న నవల ఆ మాటకు వస్తే తెలుగు నేలల్లో పేరూ కీర్తీ దక్కించుకున్న నవల కొండ పొలం. సినిమా రూపంలో వస్తున్నప్పుడు కొన్ని ఆనందాలు కలిగా యి. చాలా రోజుల తరువాత నవలా సాహిత్యానికి దక్కిన గౌరవం అని కూడా అనుకున్నాను. సినిమా చూశాక కొన్ని సినిమాటిక్ సన్నివేశాలు బాగానే కలిపారు డైరెక్టర్. బాగుంది.. ఓబులమ్మ పాత్రను బాగానే డెవలప్ చేశారు.. ప్రేమ నడిపిన విధానం బాగుంది. హీరో లక్ష్యం చేరుకున్న విధానం బాగుంది. అయినా నాలో ఏదో వెలితి. ఇప్పుడు చెబితే మరో నలుగురు వెళ్లడం మానుకుంటారా?
నవలలో వచనం బాగుంది..అంత వచనం సినిమాలో ఉండాలని నియమంతో నేను లేను. నేనే కాదు ఎవ్వరూ ఉండకూడదు. వినిపించిన మాటలు అన్నీ సీమ సౌందర్యాన్నీ, జీవగత భాషను అర్థవంతం చేశాయి. మట్టి ని సారవంతం చేశాయి వానలు.. మనిషిని మరింత ధృడతరం చేశాయి కొన్ని సందర్భాలు. లేదా అనుభవాలు. మట్టి పరిమళాలు అంటే మురిసిపోయే సీమ పల్లెలకు వానలంటే ఇంకాస్త ఎక్కువ ఇష్టం. వానొచ్చిన వేళ ఆయన పులకించిన విధానం ఎంతో బాగుంది. ఆయన పేరు త్రిపురనేని సాయిచంద్.. అలానే కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా లేవు..ఇది కూడా సినిమాకు అదనంగా చేకూరు బలం. ఇంతవరకే సినిమా మిగతాది పెద్దగా నచ్చకున్నా.. ఓ నవల పరిధిని ఆ సినిమా అంతగా సొంతం చేసుకోలేకపోయింది అన్న బాధ అయితే ఉంది. కీరవాణి విసుగెత్తించిన సందర్భాల్లో భలే కోపం కూడా వచ్చింది. ఎందుకు వచ్చిన గొడవ ఆ పాటలు లేకుండా ఉన్నా బాగుండు అన్న అభిప్రాయం చాలా మంది నుంచి విన్నాను. అదే అభిప్రాయం ఆఖరిదాకా స్థిరం చేశారు కీరవాణి. ఇవి
మినహా ఇంకొన్ని ఉంటే బాగుండు..లేకపోయినా బాగుండేది. ఎనీవే ఆల్ ద బెస్ట్ క్రిష్ అండ్ ఆల్ ద బెస్ట్ వైష్ణవ్.
- రత్నకిశోర్ శంభుమహంతి