కొండ పొలం : కమర్షియల్ హిట్ కొట్టాలి క్రిష్ ?
ఇవన్నీ కథను ముందుకు నడిపే పనులే అని చెప్పాడు క్రిష్.
సినిమాకూ, నవలకూ మధ్య బంధం ఎప్పుడో తెగిపోయింది. తెగిపోయిన బంధాలను పునరుద్ధరించే బాధ్యతతో పనిచేస్తున్నాడు క్రిష్. పూర్తి పేరు రాధాకృష్ణ జాగర్లమూడి. ఈ సినిమా హిట్ అయితే మరో మంచి ప్రయత్నం ప్రేక్షకులకు చేరితే అంతకుమించిన ఆనందం ఏముందని? తెలుగు సాహిత్యం, సినిమా చాలా రోజులుగా విడిపోయి వేర్వేరు లోకాలలో విహరిస్తున్నాయి. ఈ సారి వేర్వేరు లోకాలను కలిపి ఉంచే బాధ్యతతో క్రిష్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉండగానే ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాపై ఆసక్తి పెంచుకుంది. ఎందుకంటే నవలను సినిమాగా మలచడం అంత సులువు కాదు. అది ఈ సినిమాలో బాగా చేసేందుకు, సినిమా తీసే పనిని బాగు చేసేందుకు చేసిన ప్రతి ఆలోచన బాగుందని చిరు అంటున్నాడు.
డైరెక్టర్ క్రిష్ మూడు, నాలుగు సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. వేగం వేగంగా సినిమా తీయగలడు అన్నపేరు తెచ్చుకు న్నాడు. ఈ సారి కొండపొలం అనే రాయలసీమ నవలను సినిమాగా మలుస్తున్నాడు. కమర్షియల్ చట్రం నుంచి బయటపడి సినిమాలు తీస్తాడు అన్న పేరున్న డైరెక్టర్ ఈయన. గమ్యం, వేదం బాగున్నాయి. తరువాత సినిమాలు పర్లేదు. అవన్నీ కాస్త సినిమాటిక్ ఫార్మెట్ లో ఉన్నా కూడా ఆయన కథను నమ్ముకుని చేసిన ప్రయత్నాలు. ఇప్పుడు కొండపొలం అన్నది సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల. బాగా పేరున్న నవల. సీమ మాండలికాన్ని ముందుకు తీసుకుపోయే నవల. తానా (అమెరికా కేంద్రంగా నడిచే తెలుగు సంస్థ) ఏటా నిర్వహించే పోటీల్లో ఉత్తమ నవలగా నిలిచిన ఈ రచనా వ్యాసంగాన్ని సినిమాగా మలిచేందుకు ప్రయత్నం చేశారు క్రిష్. ఈ సినిమా కమర్షియల్ గానూ సక్సెస్ అయితే మరో నాలుగు నవలలు ఇదే ప్రయత్నంలోకి వచ్చి సినిమాగా రూపాంతరీకరణం చెందడం ఖాయం.