మీడియా అంటేనే భయపడుతున్న రకుల్..?

Purushottham Vinay
ఇక అప్పుడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎన్సీబీ విచారణ ఎదుర్కొన్న పరిస్థితి అందరికి తెలిసిందే. ఇక ఆ సమయంలో తన మీద అసత్యపు ప్రచారాలు ప్రచురించే మీడియాలను నియంత్రించాలని రకుల్ ప్రీత్ సింగ్ కోర్టుకు కూడా వెళ్లడం జరిగింది.ఇక అప్పటి నుంచి రకుల్ మీడియాకు భయపడుతూ కాస్త దూరంగానే ఉంటూ వచ్చింది.ఇక నితిన్ తో చేసిన 'చెక్' సినిమా ప్రమోషన్స్ లో కూడా డైరెక్ట్ మీడియా ఇంటరాక్షన్ లో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొనలేదు.ఇక ఈ మధ్య కూడా టాలీవుడ్ లో బాగా సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా నోటీసులు జారీ చేసి విచారించడం అనేది జరిగింది. ఇక అప్పటి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ అందుబాటులోకి వస్తే ఈ డ్రగ్స్ వ్యవహారం గురించి అడగాలని మీడియా ఎదురు చూస్తూ వుంది.

ఇక ఇప్పుడు తాజాగా నటించిన 'కొండ పొలం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు రకుల్ ప్రీత్ వస్తుందని అంతా కూడా అనుకున్నారు.ఇక అయితే ఈసారి కూడా రకుల్ డైరెక్ట్ మీడియా ఇంటరాక్షన్ ను దాటవేయడం అనేది జరిగింది.ఇక మీడియా కూడా ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం లేని 'కొండ పోలం' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ హాజరవ్వడం జరిగింది.ఇక రకుల్ ప్రీత్ సింగ్ ను బాగా ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఆ రెండు చిత్ర బృందాలు కూడా ముందుగా రికార్డ్ చేసిన వీడియోలను ఇంటర్వ్యూలను మీడియా సంస్థలకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక మరి రకుల్ ఇలా ఎంతకాలం భయపడుతూ మీడియా ఇంటరాక్షన్ కు దూరంగా ఉంటుందని సినీ అభిమానులు ఇంకా సోషల్ మీడియా వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.చూడాలి రకుల్ ఇలా ఇంకెంత కాలం భయపడుతుందో ఏమోనని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: